Hyderabad Water Supply: వేసవి రాకముందే తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్టవ్యాప్తంగా భూగర్భ జలాలు పడిపోవడంతో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించకపోగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్పందిస్తూ ప్రభుత్వంపై విరుకుపడ్డారు.
Also Read: Holiday: గుడ్‌న్యూస్.. ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు
హైదరాబాద్‌లో తాగునీటి సమస్యపై 'ఎక్స్' వేదికగా స్పందించిన హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ప్రజలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది' అని మాజీమంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో ఇలాంటి తాగునీటి సంక్షోభం లేదని గుర్తుచేశారు.
Also Read: DK Aruna: 'ఎన్నికల్లో ఇచ్చిన 420 హమీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం'
'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదికే పరిస్థితి విషమించింది. తెలంగాణలో భూగర్భజలాలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు అడుగంటిపోయాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశంలోనే భూగర్భ జలాలు భారీగా క్షీణించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. హైదరాబాద్‌లో 15 శాతం అదనంగా వర్షపాతం నమోదైనా భూగర్భజలాలు 1.33 మీటర్లు తగ్గాయి. కూకట్‌పల్లిలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ భూగర్భ జలమట్టం ఏకంగా 25.90 మీటర్ల లోతుకు పడిపోయింది' అని హరీశ్ రావు వెల్లడించారు.
'ఇప్పటికే నిత్యావసరాల ధరలతో విలవిలలాడుతున్న సామాన్యులు నీటి ట్యాంకర్ల కోసం రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గొంతు తడుపుకోడానికి కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమది ప్రజాపాలన అని ఊదరగొట్టుకోవడం సిగ్గుచేటు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.
'బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందింది. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంతో ఎండాకాలంలో చెరువులు మత్తడులు దుంకాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెరువులు ఎండిపోతుంటే.. భూగర్భజలాలు పడిపోతున్నాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రచారంలోనే మునిగిపోయిందని మండిపడ్డారు. పాలనపై శ్రద్ధ పెట్టకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలతో బిజీగా ఉందని విమర్శించారు.
Hyderabad never saw a drinking water crisis like this under #KCR garu’s regime.
But today, even before the onset of summer, borewells are drying up, groundwater is depleting, and people are forced to buy water tankers.
History suggests that a Congress regime leads to a water… pic.twitter.com/DccanihzLF
— Harish Rao Thanneeru (@BRSHarish) February 25, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









