)
Dasara School Holidays: దసరా సందర్భంగా స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. దసరా నవరాత్రుల సందర్భంగా ఏకంగా 13 రోజుల పాటు సెలవులను ప్రకటించినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త తెలిసిన విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వీటితో పాటు జూనియర్ కాలేజీలు, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు కూడా వేర్వేరు తేదీల్లో సెలవులు ఇవ్వనున్నారు.
ఏపీ స్కూళ్లకు సెలవులు తేదీలివే?
దసరా నవరాత్రుల సందర్భంగా ఏపీలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలలకు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ 9 రోజుల పాటు దసరా నవరాత్రి సెలవులు ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.
గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో..
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఈ నెల 6న తేదీన ఘనంగా నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈనెల 6వ తేదీన సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సెప్టెంబరు 5వ తేదీన కొన్ని స్కూళ్లకు సెలవులు ఉండడం వల్ల తెలంగాణలో సెప్టెంబరు 5, 6వ తేదీల్లో సెలవులు ఉండనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook