)
Daughter husband killed by mother in law in nirmal: ఇటీవల కాలంలో కొంత మంది వావి వరుసలు మర్చిపోయి పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా.. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడం లేదు. ఆడది కన్పిస్తే చాలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది ఆఫీసుల్లో మహిళలు వేధింపులు గురౌతున్నారు. రద్దీగా ఉన్న చోట మహిళల్ని వేధిస్తున్నారు.
మరికొన్ని సందర్భాల్లో ఇళ్లలో కూడా బంధువులు, రక్తం పంచుకుని పుట్టిన వారు, కంటికి రెప్పలా కాపాడాల్సిన వారి చేతిలో వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాగిన మత్తులో కొంత మంది అసలు ఏంచేస్తున్నారో కూడా తెలియక నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని హిమాయత్ నగర్ కు చెందిన ఒక కుటుంబం నిర్మల్ లో ఉంటున్నారు. షేక్ నజీం (45) తన భార్య, కుమారుడు, అత్తమ్మతో కలిసి ముథోల్ మండలం తరోడా గ్రామంలో ఉంటున్నారు. ఇటీవల నజీం భార్య ఊరికి వెళ్లింది.దీంతో అత్త ఒక్కర్తే ఉంది. ఇది గమనించిన నజీమ్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. అత్తను చూసి కామంతో రగిలిపోయాడు. పశువులా మారిపోయి.. వృద్దురాలైన ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దీంతో అత్త తీవ్రంగా ప్రతి ఘటించింది. అక్కడున్న ఒక్క కర్రతో అల్లుడిపై దాడి చేసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత వృద్ధురాలికి కూడా గాయాలు కావడంతో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చింది. అయితే.. మరల నజీం రాత్రిపూట.. మరోసారి లైంగిక దాడికి యత్నించాడు.
ఈ క్రమంలో ఆమె పక్కనే ఉన్న కర్రతో అతన్ని బలంగా కొట్టింది.. స్పృహ తప్పి పడిపోయిన నజీంను.. అత్త గొంతు నులిమి హత్య చేసింది. తన ప్రాణాల్ని,మానాన్ని కాపాడుకొవడానికి ఈ విధంగా చేసినట్లు అక్కడి వారితో వృద్ధురాలు చెప్పింది. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటన సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.