)
Hyderabad Degree student got 333 kgs ganesh laddu just rupees 99 in lucky draw: దేశ మంతట కూడా ప్రశాంతంగా గణపయ్య నిమజ్జనం జరిగింది. ఎంతో భక్తి భావనలతో గణపయ్య విగ్రహాల నిమజ్జనంను నిర్వహించారు. అయితే.. గణపయ్య విగ్రహాల దగ్గర ఇటీవల పూజల్లో లడ్డులను పెడుతున్నారు. వాటిని చివరి రోజు వేలంపాట వేస్తున్నారు. ఇక లడ్డు వేలం పాట అంటే మొదటగా గుర్తొచ్చేది హైదరాబాద్ లోని బాలాపూర్ గణపయ్య.
హైదరాబాద్ కొత్తపేటలో ఓ విద్యార్థి 333 కేజీల గణేశ్ లడ్డూను లక్కీ డ్రాలో గెలిచి కేవలం ₹99కే దక్కించుకున్నాడు! #vinayakachavithi2025 pic.twitter.com/qyXfglqmpW
— greatandhra (@greatandhranews) September 7, 2025
ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలంలో రూ.35 లక్షలు పలికింది. సాధారణంగా బలాపూర్, బండ్లగూడ, ఉప్పల్, కూకట్పల్లి ప్రాంతాల్లో లడ్డు వేలం పాలకు ఫెమస్ అని చెప్పుకొవచ్చు. ఈసారి కూడా వేలం పోటీలో రికార్డు స్థాయిలో బిడ్లు నమోదయ్యాయి. అయితే.. దాదాపు.. 333 కేజీల లడ్డును డిగ్రీ విద్యార్థి ఎలాంటి వేలంపాట లేకుండా కేవలం రూ. 99 కే గెల్చుకున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని కొత్తపేట గణేశ్ ఉత్సవాల్లో ప్రతి ఏటా కూడా గణపయ్య విగ్రహం దగ్గర లడ్డును ఉంచుతారు. దీనికి వేలం పాటతో కాకుండా.. లక్కీ లాటరీని నిర్వహిస్తారు. దీని రుసుమును కూడా కేవలం రూ.99 గా నిర్ణయించారు. అయితే..ఈ సారి 333 కేజీల గణపయ్య లడ్డును.. లక్కీ డ్రాలో.. బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ కేవలం రూ.99కే.. దక్కించుకున్నాడు.
సుమారు 760 టోకెన్లలో అతడినే అదృష్టం ఇతడ్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈసారి లక్కీ డ్రా రూపంలో ప్రసాదం విద్యార్థికి దక్కడం చర్చనీయాంశమైంది. తనకు ఆ వినాయకుడి ఆశీర్వాదంలో లడ్డు లక్కీ లాటరీ రూపంలో లభించిందని విద్యార్థి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
మొత్తంగా యూత్ సభ్యులు సైతం సదరు స్టూడెంట్ ను అభినందించారు. బాలుడి కుటుంబ సభ్యులు కూడా ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. గణపయ్య ఆశీర్వాదం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook