Delhi red fort bomb blast High alert in Hyderabad cp sajjanar issued key orders: దేశ రాజధాని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించడంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ అధికారులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం కావడంతో ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు ఉంది. అందువల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు భావిస్తున్నారు.
మరోవైపు.. ఢిల్లీ ఉగ్రదాడితో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సీపీ సజ్జనార్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నాకాబందీ చేసి మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైన అనుమానస్పద వస్తువులు, వ్యక్తులు కన్పిస్తే వెంటనే పోలీసులకు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు.
Read more: Delhi Blast: ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. 9 మంది దుర్మరణం.. దేశంలో హైఅలర్ట్.. అసలేం జరిగిందంటే..?
ఓల్డ్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒకవైపు బీహర్ లో సెకండ్ ఫెస్ ఎన్నికలు, మరోవైపు పలు చోట్ల ఉపఎన్నికల నేపథ్యంలో ఈ పేలుడు ఘటన దేశంలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









