Dhee show dance commits suicide video: ఖమ్మం జిల్లాలో ఢీషో డ్యాన్సర్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెనుసంచలనంగా మారింది. తనను ఢీషో డ్యాన్సర్ అభి.. ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడని... ఐదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని యువతి చెప్పింది. అంతే కాకుండా.. ఇటీవల అభి తనను కావాలని దూరం పెడుతున్నాడని.. మరోయువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడని యువతి కన్నీళ్లుపెట్టుకుంది.
ఢీ షో డాన్సర్ నన్ను మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య
ఖమ్మం రూరల్ పొన్నెకల్లులో ఘటన
నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి అని కావ్య కళ్యాణి ఆరోపణ
తనని పెళ్ళి చేసుకుని కాపురం ఉంటూ.. ఇప్పుడు మరొకరిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్య… pic.twitter.com/EHBZLr4pS3
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025
ఈ క్రమంలో యువతి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా లోని పొన్నెకల్లులోని తన ఇంట్లో సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన చావుకు అభి కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గమనించి..యువతిని వెంటనే కిందకు దించారు. కానీ ఆమెలో చలనం కన్పించలేదు. వెంటనే డాక్టర్ ను రప్పించగా.. అప్పటికే చనిపోయిందని కూడా వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.
దీనిపై విచారణచేపట్టారు.యువతి సెల్పీ వీడియో తీసుకుని మరీ చనిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢీ షో కార్యక్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగామారిందని యువతి చెప్పుకొచ్చింది.
దీంతో తనను పెళ్లిచేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని.. కొన్నిరోజులుగా టార్చర్ చేస్తున్నాడని, ఇంట్లోనుంచి వెళ్లిపొవాలని వేధిస్తున్నాడని కూడా యువతి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అతగాడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి వెల్లడించింది. యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









