Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ తుది తీర్పు నేడే.. అసలు ఆరోజు ఏం జరిగింది?

Dilsukh Nagar Bomb last: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీన ఈ జంట బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. 130 మందికి పైగా గాయాలయ్యాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 8, 2025, 09:44 AM IST
Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ తుది తీర్పు నేడే.. అసలు ఆరోజు ఏం జరిగింది?

Dilsukh Nagar Bomb last: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్‌సుఖ్‌నగర్‌  బాంబ్ బ్లాస్ట్ ఘటనపై నేడు తుది తీర్పు రానుంది. తెలంగాణ హైకోర్టు ఈ ఘటనపై తుది నిర్ణయం ఈ మేరకు తీసుకోనుంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనలో దాదాపు 18 మంది మృతిచెందగా 130 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనలో నిందితులు యాసిన్ భత్కల్‌ సహా ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్‌ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై తుది నిర్ణయం రానుంది. 

Add Zee News as a Preferred Source

దిల్‌సుఖ్‌నగర్‌  బాంబ్ బ్లాస్ట్ లో అసలు ఏం జరిగింది ?
అయితే ఇప్పటికీ ఈ బాంబ్ బ్లాస్ట్ ఘటనను హైదరాబాద్ వాసులు మర్చిపోలేరు. ఇక బాంబ్ బ్లాస్ట్ లో మృతి చెందిన వారి కుటుంబానికి తీరని శోకాన్నే మిగిల్చింది. అప్పట్లో కళ్ళముందే భయానక దృశ్యాలను చూసి హైదరాబాద్‌వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబ్ బ్లాస్ట్ కేవలం 150 మీటర్ల వ్యాసార్థం లోని రెండు పేలుళ్లు వెంట వెంటనే జరిగాయి. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్ ఎదురుగా రద్దీగా ఉండే ప్రాంతంలో సైకిల్ పై ఉగ్రవాదులు బాంబుల అమర్చి వెళ్లారు. ఇక టిఫిన్ బాక్స్ లో బాంబులు పెరగడంతో దాదాపు 18 మంది చనిపోయారు. 130 మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు

అయితే మొదటి బాంబు కొణార్క్‌ థియేటర్ ఎదురుగా 19:02 ప్రాంతంలో పేలగా.. రెండో బాంబు వెంకటాద్రి థియేటర్ దగ్గర 19:06 ప్రాంతంలో పేలింది. ఘటన జరిగిన వెంటనే ఎన్ఐఏ జాతీయ భద్రతా దళం దిల్‌సుఖ్‌నగర్‌  చేరుకుంది. అయితే తమకు ముందే సమాచారం ఉందని కానీ పేలుడు జరిగే ప్రదేశం పై కచ్చితంగా  సమాచారం లేదని అప్పటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే నిందితులు ఇంప్రూవైజ్డ్‌ డివైసెస్ ఉపయోగించి పేలుళ్లకు తెగబడ్డారు. ప్రధానంగా ఢిల్లీ పోలీసులు విచారణలో మగ్బూల్ అనే ఇండియన్ ముజాహిద్ కార్యకర్త 2012 నుంచి దిల్‌షుక్‌ నగర్‌లో మఖం వేసి ప్రణాళికవేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్‌తోపాటు అసదుల్లా అక్తర్‌ (పాకిస్తాన్), తహసిక్ అక్తార్ (బీహార్), ఎజాజ్ షేక్‌ (మహారాష్ట్ర) న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే 2008 అనంతరం జరిగిన దాదాపు పది బాంబు పేలుళ్ల కూడా యాసిన్ భత్కల్‌ సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

READ ALSO: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనుమతికి గ్రీన్ సిగ్నల్!?

2008- సూరత్ బాంబు పేలుళ్లు, 2010- బెనారస్ ,బెంగళూరు చిన్న స్వామి స్టేడియం, 2011 పూణే జన్మన్ బేకరీ, ముంబై పేలుళ్లు, 2013 హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి. ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే పేలుళ్లకు సూత్రధారి అయిన సయ్యద్ మక్బూల్ మాత్రం మృతి చెందాడు. 2024లో మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. ఇతనికి ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది.

READ ALSO:  స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కొడుకు మార్క్‌ శంకర్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News