Divvela Madhuri: మూడు పెళ్లిళ్ల పవన్ మాకు ఆదర్శం.!. ఫామ్ హౌస్ పార్టీపై దివ్వెల మాధురీ షాకింగ్ కామెంట్స్..

Duvvada srinivas and divvela madhuri on farm house party: దువ్వెడ శ్రీనివాస్ కు చెందిన ఒకఫ్రెండ్ పిలిస్తే పార్టీకి వెళ్లామని దివ్వెల మాధురీ తెలిపారు. అసలు అక్కడ విదేశీ లిక్కర్ ఉందని తమకు తెలియదన్నారు.  కొంత మంది తమపై లేని పోనీ ప్రచారాలు చేస్తున్నారన్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 12, 2025, 06:56 PM IST
  • ఫామ్ హౌస్ పార్టీపై క్లారిటీ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్..
  • అదంతా ఫెక్ అంటూ సీరియస్..
Divvela Madhuri: మూడు పెళ్లిళ్ల పవన్ మాకు ఆదర్శం.!. ఫామ్ హౌస్ పార్టీపై దివ్వెల మాధురీ షాకింగ్ కామెంట్స్..

Divvela Madhuri and duvvada srinivas on farm house liquor party: దివ్వెల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ లు ఇటీవల హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో పార్టీలో అడ్డంగా దొరికిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొంత మంది అయితే ఒక అడుగు ముందుకేసి దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారని కూడా జోరుగా నెట్టింట ప్రచారం చేశారు. దీనిపై తాజాగా.. దివ్వెల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ క్లారిటి ఇచ్చారు. అసలు తమపై వస్తున్నదంతా అసత్య ప్రచారమన్నారు.

Add Zee News as a Preferred Source

దువ్వాడ శ్రీనివాస్ ఫ్రెండ్ పార్థసారథీ అనే వ్యక్తి పార్టీకి రమ్మని పిలిస్తే వెళ్లామన్నారు. అక్కడ విదేశీ మద్యం, హుక్కా మొదలైనవి  తమకు తెలియదన్నారు. కేవలం బిజీనెస్ మీట్ కు మాత్రమే వెళ్లామని తెలిపారు. అనేక బిజినెస్ లలో ఉండటం వల్ల తాముఈ బిజీనెస్ కు మీట్ కు వెళ్లామని క్లారిటీ ఇచ్చారు. పోలీసుల తమను చూసి గుర్తు పట్టి మాట్లాడితే.. ఆ తర్వాత అక్కడి నుంచి బైటకు వెళ్లిపోయామన్నారు. తన బర్త్ డే నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పార్టీ ఇచ్చాడని అనే దాంట్లో నిజంలేదన్నారు.

అంతేకాకుండా.. బిగ్ బాస్ 9 సీజన్ లో వచ్చిన ప్రైజ్ మనీని పేదవారికి, అనాథలకు పంచిపెడుతున్నట్లు చెప్పారు.  తామిద్దరం ఇప్పటికే దండలు మార్చుకున్నామని, కోర్టు నుంచి కేసులు పరిష్కారం అయ్యాక అధికారికంగా పుస్తెల తాడు తన మెడలో దువ్వాడ శ్రీనివాస్ కడతారన్నారు.

Read more: Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

అంతేకాకుండా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తమకు ఆదర్శమని, తాము రెండు పెళ్ళిళ్లు చేసుకుంటే జనాలకు వచ్చిన నొప్పి ఏంటని కూడా తీవ్రస్థాయిలో పంచ్ లు వేశారు. మొత్తంగా దివ్వెల మాధురీ ,దువ్వాడ శ్రీనివాస్ ఫామ్ హౌస్ వివాదంపై క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కు చెక్ పడినట్లైంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News