)
Bandi Sanjay 10th Class Paper Leakage: తెలంగాణలో తీవ్ర సంచలనం రేపిన పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్ లీక్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో బండి సంజయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్‌పై పదో తరగతి పేపర్ లీక్ కేసును హైకోర్టు కొట్టివేయడంతో గురువారం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పందించారు. బండి సంజయ్‌పై ఉన్న టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసు హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంప పెట్టు అని తెలిపారు. పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చిన హైకోర్టు బండి సంజయ్ గారిని నిర్దోషిగా తేల్చిందని వెల్లడించారు. బండి సంజయ్‌పై ద్వేషంతో ప్రభుత్వం అకారణంగా కేసులు పెట్టి వేధించింది. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన బండి సంజయ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దిగజారి వ్యవహరించారు. ఆనాడు బీజేపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక బండి సంజయ్‌పై వందలాది కేసులు పెట్టి వేధించారు. బండి సంజయ్ కార్యక్రమాలపై, బీజేపీ పోరాటాలపైన అనేక నిర్బంధాలు ఉంచి ఇబ్బంది పెడుతున్నారు' అని ఎంపీ డీకే అరుణ అసహనం వ్యక్తం చేశారు.
పాలమూరులోనూ బీజేపీ కార్యకర్తలపైన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసిందని డీకే అరుణ గుర్తుచేశారు. బీజేపీ కార్యకర్తలపై అకారణ కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర వారిదేనని ప్రకటించారు. అన్నింటినీ భరిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంతోనే ప్రభుత్వం పతనమైందని తెలిపారు. ప్రజా కంటకంగా వ్యవహరించే పాలకులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని ఎంపీ డీకే అరుణ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి