వీడదీయ లేని బంధం; శునకం పెద్ద కర్మ  చేసి ఊరంతా పిలిచిన దంపతులు !!

 మానవత్వం ఇంకా సజీవంగానే ఉందనే దానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యం

Last Updated : Jan 11, 2019, 05:12 PM IST
వీడదీయ లేని బంధం; శునకం పెద్ద కర్మ  చేసి ఊరంతా పిలిచిన దంపతులు !!

మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ మూగజీవితో వీడిదీయ లేని బంధం ఏర్పడుచుకున్నారు ఆ దంపతులులు. గ్రాండ్ గా పెద్ద కర్మ నిర్వహించి..ఆ శునకం పట్ల తమ అనుబంధాన్ని చాటి చెప్పారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే . ఖమ్మం జిల్లా సత్తుపలి మండలం యాతాలకుంటలో కోటేశ్వరరావు రమణమ్మ దంపతులు  ఓ కుక్కకు 14 ఏళ్లగా పెంచుకుంటున్నారు. దానికి మున్నీ అనే నామకరణం చేశారు. కిడ్నీలు ఫెయిల్ అయి ఇటీవలె మన్నీ చనిపోయింది. మున్నీ మరణంతో కన్నీూరు మున్నీయ్యారైన ఆ దంపతులు.. పెద్ద కర్మ రోజు ఊరందరికీ పిలిచి భోజనాలు పెట్టారు. ఇలా కుక్క పట్ల ఉన్న ఆ దంపుతులకు ఉన్న అనుబంధాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మానవత్వం ఇంకా సజీవంగానే ఉందనే దానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్షంమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు

 

 

Trending News