Deer Injured in HCU Video: హెచ్‌సీయూలో తీవ్రంగా గాయపడ్డ జింక.. సీఎం రేవంత్‌పై మండిపడుతున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

Kancha Gachibowli controversy: హైదరబాద్ లో హెచ్‌సీయూలో ఇటీవల అడవును నరికి వేయడం వల్ల అక్కడుంటే మూగజీవాలు కాలేజీ ఆవరణలో, అక్కడ ఇళ్ల దగ్గరకు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని శునకాలు జింకలపై దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ సింహల దాడిలో ఒక జింక తీవ్రంగా గాయపడింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2025, 01:52 PM IST
  • జింకపై కుక్కల దాడి..
  • కాపాడుతున్న సిబ్బంది..
Deer Injured in HCU Video: హెచ్‌సీయూలో తీవ్రంగా గాయపడ్డ జింక.. సీఎం రేవంత్‌పై మండిపడుతున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

Dogs attacks on deers in hcu  video: హెచ్‌సీయూ వివాదం ప్రస్తుతం దేశంలో హట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ సర్కారుకు సుప్రీమ్ కోర్టు మొట్టికాయలు వేసింది. వెంటనే అక్కడ ప్రభుత్వంచర్యల్ని వెంటనే ఆపేయాలని స్టేను విధించింది. ఈక్రమంలో దీనిపై ప్రభుత్వం ఎందుకు అతిగా ప్రవర్తించిందని, అత్యున్నత ధర్మాసనం చివాట్లు పెట్టింది. అంతేకాకుండా.. ఈ ఘటనలో తెలంగాణ సీఎస్ ను ప్రతివాదిగా చేర్చింది. గౌరవ కోర్టు వారి ఉత్తర్వులను బేఖాతరు చేస్తే.. సీఎస్ జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని సీరియస్ అయ్యింది.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల అడవుల్లో ఎలాంటి జంతువులు లేవని, కేవలం కొన్ని గుంటనక్కలు చేరి అక్కడి విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇదిలా ఉండగా.. దీనిపైన హెచ్‌సీయూ విద్యార్థులు మాత్రం ఏమాత్రం తగ్గెదెలా అన్న విధంగా నిరసనలు తెలిపారు. ఇక సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో తెలంగాణ సర్కారు మంత్రుల కమిటీని దీనిపై నియమించింది.

 

ఇదిలా ఉండగా.. హెచ్‌సీయూ అడవుల్లో జంతువులు లేవని, నెమళ్లు, జింకలు.. కేవలం ఏఐ టెక్నాలజీతో ఫెక్ గా వైరల్ చేస్తున్నారని కూడా కొంతమంది ప్రచారం చేశారని కాంగ్రెస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ అక్కడ భారీ సంఖ్యలో జింకలు, నెమళ్లు.. హెచ్‌సీయూకు సమీపంలోని ఇళ్లు, ఆఫీసులు, రోడ్లమీదకు వస్తున్నాయి. అక్కడున్న వారు జింకలకు తాగు నీటి సదుపాయం కల్పించిన వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా.. హెచ్‌సీయూ అడవిలో ఒక భారీ జింకను కుక్కలు దాడిచేసి గాయపర్చాయి.

దీంతో అది నడవలే ఒక చోట కూలిపోయింది. వెంటనే దీన్ని గమనించిన హెచ్‌సీయూ భద్రత సిబ్బంది.. సదరు జింకను వైద్యం కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ఈ గాయపడిన జింకల వీడియోలను చూపిస్తు..కొంత మంది విద్యార్థి సంఘాలు నేతలు.. ఇప్పుడు ఏమంటారని... ఇది కళ్లముందు కన్పిస్తుదీగా.. అంటూ మండిపడుతున్నారు.

Read more: Secunderabad: రన్నింగ్ ట్రైన్‌లో మరో ఘోరం.. అరగంటపాటు మైనర్ బాలికపై వాష్ రూమ్‌లో అఘాయిత్యం..!

తీవ్రంగా గాయపడ్డ జింకను సెక్యురిటీ సిబ్బంది నలుగురు పట్టుకుని వ్యాన్ లో ఎక్కించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు. ఇకనైన హెచ్‌సీయూపై లేనీ పోనీ విమర్శలు చేయడం మానుకొని.. నోరులేనీ జీవాల ఉసురు పోసుకొవద్దని కూడా విద్యార్థులు , పలువురు నేతలు కాంగ్రెస్ కు చివాట్లు పెడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News