Telangana Big Scam: నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం పేరిట కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పేదల అమాయకత్వాన్ని ఆసారాగా చేసుకుని అందిన కాడికి దోచుకుని గాయబ్ అవుతున్నారు. రూ.లక్షల్లో దండుకుని ప్రజలను నిండా ముంచుతున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేటుగాళ్ల మాయమాటలకు చిక్కి దాదాపు 200 మందికి పైగా ప్రజలు మోసపోయారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Konda Surekha Tears: విషాదంలో మంత్రి కొండా సురేఖ.. తట్టుకోలేక బోరున ఏడ్చేశారు
డబుల్ బెడ్రూమ్ పథకం పేరిట నకిలి ప్రభుత్వ సర్తిఫికేట్లు తయారు చేసి మోసానికి పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీ ఛత్రినాక ప్రాంతానికి చెందిన ఎం.జ్యోతి, సునీల్ సింగ్ ఆ ప్రాంతంలో స్థానికంగా అవసరమైన వారికి బర్త్, డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయిస్తూ కొంత గుర్తింపు పొందారు. ప్రభుత్వ పనులు తమ ద్వారా జరుగుతాయని.. తమను తాము సోషల్ వర్కర్లుగా గుర్తింపు వచ్చింది.
Also REad: Bride Baby Birth: పెళ్లయిన రెండు రోజులకే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో పెళ్లి కొడుకు
ఇదే అదునుగా ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూరూమ్ ఇండ్లు మంజూరు చేయిస్తామని స్థానిక ప్రజలను నమ్మించడం ప్రారంభించారు. అమాయకుల నుంచి రూ.పది వేల నుంచి 20 వేల ఒక్కొక్కరి నుంచి తీసుకుంటున్నారు. అనంతరం నకిలీ డాక్యుమెంట్లు తయారీ చేసి వారికి ఇస్తున్నారు. అయితే ఎంతకీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు రాకపోవడంతో బాధితులు వారిని నిలదీయడం చేస్తున్నారు. కొందరికి అప్పటికప్పుడు ఏదో ఒకటి నచ్చచెప్పడం.. మరికొందరికి సమాధానం చెప్పకుండా ఉండడం చేస్తున్నారు. అయితే వారిని నమ్మి తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఛత్రినాక పోలీసులు విచారణ చేపట్టారు.
అనంతరం మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సోషల్ వర్కర్ ఎం.జ్యోతి, సునీల్ సింగ్‌తోపాటు వీరికి సహకరిస్తున్న సంతోశ్ నగర్‌కు చెందిన కిరాణా దుకాణాదారుడు రమేశ్‌తోపాటు ఛత్రినాకకు చెందిన రాపిడో డ్రైవర్ ఎల్. నితిన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ డాకుమెంట్స్, లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ప్రజలు ఎవరూ ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వ పథకాలు అధికారుల ద్వారానే వస్తాయని పోలీసులు వివరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









