Double Murder: ఫిజియోథెరపీస్టుల అఘాయిత్యం? హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం

Four Physiotherapists Killed Old Couple In Hyderabad: పట్టపగలు హైదరాబాద్‌లో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చిన దుండగులు వృద్ధులైన భార్యాభర్తలను అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 6, 2025, 02:42 PM IST
Double Murder: ఫిజియోథెరపీస్టుల అఘాయిత్యం? హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం

Hyderabad Double Murder: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో వరుస దారుణ సంఘటనలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. భార్యను ముక్కలు ముక్కలుగా చేసి ఉడికించిన సంఘటనతోపాటు బాచుపల్లిలో గర్భం దాల్చిన భార్యను చంపేసి సూట్‌కేసులో భద్రపర్చడం.. తాజాగా ఫిజియోథెరపీ చేయడానికి వచ్చిన దుండగులు ఎవరూ లేని సమయంలో వృద్ధ దంపతులను హత్య చేసి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Rtd Employees: 'అంత చేసి ఇంతేనా?'.. తెలంగాణ డీఏలపై రిటైర్డ్‌ ఉద్యోగుల అసహనం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని జనచైతన్య ఫేస్ 2 వెంచర్‌లో అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ ఉంది. ఈ అపార్టెమెంట్‌లోని 5వ అంతస్తులో షేక్ అబ్దుల్లా (70), రిజ్వానా (65) నివసిస్తుండేవారు. వీరు కొంతకాలంగా అనారోగ్యం చెందడంతో తరచూ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిజియోథెరపీ చేసేందుకు శుక్రవారం ఉదయం నలుగురు వ్యక్తులు వచ్చినట్లు సమాచారం. వారు వచ్చిన వెళ్లిన అనంతరం వృద్ధ దంపతులు తీవ్ర రక్తపు మడుగులో ఉన్నారు. ఎంతకీ వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో చూడగా వృద్ధ దంపతులు నిర్జీవంగా పడి ఉన్నారు. వెంటనే రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Victory Parade Stampede: 11 మంది మృతికి విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలా? నెటిజన్లు ఏమంటున్నారో చూడండి

పోలీసులు వచ్చి బెడ్‌రూమ్ పరిశీలించగా రక్తం మడుగులో షేక్ అబ్దుల్లా, రిజ్వానా  పడి ఉన్నారు. అత్యంత దారుణంగా వారిని హత్య చేశారని వృద్ధ దంపతుల మృతదేహాలను చూస్తే అర్థమవుతోంది. డబ్బుల కోసం హత్య చేశారా , లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తెలుస్తోంది. హత్య అనంతరం ఇంట్లో నగలు, నగదును దోచుకెళ్లారు. ఇంట్లోని వస్తువులు, బీరువా చిందరవందరగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News