)
Ticket Fare Hike: కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో భక్తులకు భారీ షాక్ తగిలింది. భక్తులు చేయాల్సిన విశేష పూజలు, ఆర్జిత సేవలకు సంబంధించి టికెట్లు అడ్డగోలుగా పెంచారు. ప్రస్తుతం ఉన్న రేట్లను రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరలు ఈనెల 15వ తేదీ నుంచి అమలుచేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన కీలక నిర్ణయాలను ఆలయ ఈవో శ్రీకాంత్ రావు వెల్లడించారు. ఆర్జిత సేవలు, పూజల టికెట్ల ధరలు రెట్టింపు పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన ఆర్జిత సేవలు ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న చందనం పూజ రూ.800 నుంచి రూ.15,00కు, అంతరాలయ దర్శనం రూ.400 నుంచి రూ.800, గండాదీపం ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు, 11 రోజుల హారతి రూ.250 నుంచి రూ.516, శాశ్వత అభిషేకం రూ.1,116 నుంచి పది సంవత్సరాల వరకు రూ.10,116 రూపాయలకు పెంచారు.
సుప్రభాత సేవా (ఇద్దరికి) రూ.1000, వడమాల బోగము రూ.1116, రూ.మన్యసుక్త హోమం రూ.2000, శనిగ్రహ పీడ నివారణ పూజ అమావాస్య రోజు రూ.1000గా నిర్ణయించినట్లు ఆలయ ఈవో తెలిపారు. భక్తుల సౌకర్యం, ఆలయ అభివృద్ధి దృష్ట్యా రేట్లు పెంచి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. రేట్ల పెంపుపై గత జూన్ 27న నోటిఫికేషన్ జారీ చేయగా.. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో పెంచిన రేట్లను ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్లు కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి