Drunk girl car rash driving in Hyderabad: వాహనాలు నడిపే వారు రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత చెప్పిన కూడా కొంత మంది మారడం లేదు. ప్రతిరోజు కూడా రోడ్డుపైన ఇష్టాను సారం వాహనాలు నడిపించి, తమ ప్రాణాలు మాత్రమే కాకుండా.. ఎదుటి వారి ప్రాణాలు సైతం డెంజర్ లో నెట్టేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం కొంత మంది కారునడిపేటప్పుడు సీటు బెల్టు కోవడంలేదు.
మరికొందరు తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్నారు. టూవీలర్ మీద వెళ్తు రోమాన్స్ చేస్తున్నారు. హెల్మెట్ లు పెట్టుకొవడంలేదు. అంతేకాకుండా.. త్రిబుల్ రైడింగ్ లు చేస్తున్నారు. చాలా మంది కారును రాంగ్ రూట్ లో నడిపిస్తున్నారు.
మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు
ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు
హైదరాబాద్ - KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు
ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించిన యువతులు
ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించిన ద్విచక్ర వాహనదారుడు
రంగంలో… pic.twitter.com/tVUegVvc3W
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025
ముఖ్యంగా తాగి వాహనాలు నడిపేవారితో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారారని చెప్పుకొవచ్చు. అయితే.. తాగి వాహనాలు నడిపిస్తున్న వారిలో అమ్మాయిలు, అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపొకుండా ప్రవర్తిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటన పెనుదుమాంగా మారింది.ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
పూర్తి వివరాలు..
హైదరాబాద్ లో కేపీహెచ్ బీలో లో నిన్న రాత్రి (శుక్రవారం) కారులో కొంత మంది అమ్మాయిలు తప్పతాగి కారును నడిపించారు. అంతే కాకుండా.. రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టారు. కారును ఆపి వారితోనే వాగ్వాదంకు దిగారు. దీంతో వాహనా దారులు వీరి ప్రవర్తన పట్ల ఒకింత షాక్ కు గురయ్యారు.ఆ తర్వాత కారును ఆపకుండా స్పీడ్ గా వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అక్కడున్నవారు... వీరిని అడ్డగించారు. వెంటనే కారును ఆపివేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని.. అమ్మాయిలకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారు. ఈ క్రమంలో అమ్మాయిలకు టెస్ట్ చేయగా.. ఒక యువతికి.. 212 రీడింగ్ వచ్చింది.
Read more: Snake in Ice Cream: బాప్ రే బాప్.. ఐస్ క్రీమ్ తింటుండగా బైటపడ్డ గడ్డ కట్టిన పాము.. ఎక్కడో తెలుసా..?
అదే విధంగా కారులు లిక్కర్ బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై అక్కడున్న వారు మండిపడుతున్నారు. అమ్మాయిలపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









