)
Drunk men creates nuisance in running bus in Warangal Video: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది రన్నింగ్ బస్సుల్లో రెచ్చిపోతున్నారు. ఇటీవల కొంత మంది మహిళలు రన్నింగ్ బస్సులో రచ్చచేస్తున్నారు. తోటి ప్రయాణికులతో గొడవలు పడుతున్నారు. జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. మరికొంత మంది ప్రయాణికులు తప్పతాగి బస్సులో ఎక్కి డ్రైవర్, కండక్టర్ ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన పోకిరీలు
నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడి
హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో, వరంగల్ వద్ద బస్సు ఎక్కిన ఇద్దరు మందు బాబులు
నర్సంపేట వద్ద దిగాల్సి… pic.twitter.com/G8Lq2V4AW3
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2025
కొంత మంది దాడులు కూడా చేస్తుంటారు. తప్పతాగి తోటి ప్రయాణికుల పట్ల రూడ్ గా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో బస్సుల్లో కొంత మంది డ్రైవర్ల, కండక్టర్లపై దాడుల ఘటనపై తెలంగాణ ఆర్టీసీ సీరియస్ అయ్యింది. అంతే కాకుండా కేసుల్ని కూడా పెడతామని హెచ్చరించింది. అయిన కూడా ఈ ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మందుబాబులు రెచ్చిపోయారు. డ్రైవర్, కండక్టర్ లను బూతులు తిట్టుకుంటూ దాడులకు ప్రయత్నించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మందుబాబుల హల్ చల్ చేశారు. వరంగల్ వద్ద ఇద్దరు మందు బాబులు బస్సులో ఎక్కారు. అంతే కాకుండా.. డ్రైవర్ పక్కన కూర్చుని వాగ్వాదంకు దిగారు. తాగిన మైకంలో నోటికొచ్చినట్లు మాట్లాడారు.
నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగారు. దీంతో బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులు వీళ్ల యవ్వారంను వీడియో తీశారు. అసలు వారిద్దరు కూడా.. నర్సంపేట వద్ద దిగాల్సి ఉండగా, దిగకపోవడంతో బస్సు ఆపి మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని కండక్టర్ లేపడంతో నోటికొచ్చినట్లు మాట్లాడారు.
నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న.. మీ సంగతి చూస్తామంటూ, మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ సిబ్బందిపై రెచ్చిపోయారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందిపై వరుస దాడుల ఘటనలు ఆందోళనలు కల్గించే అంశంగా మారింది. కొంత మంది ఉద్యోగులు దీనిపై ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook