)
Young Woman drives car on railway track in shankarpalli video: కొంత మంది యువత ఇటీవల చాలా వెరైటీగా ప్రవర్తిస్తున్నారు. ఏమన్నా చేసి ఫెమస్ అయిపోవాలని తెగతాపత్రయపడుతున్నారు. కొన్ని సార్లు వీళ్లు తుంటరీ పనుల వల్ల వాళ్లు డెంజర్ లో పడటమే కాకుండా.. ఇతరుల్ని కూడా ప్రమాదాల్లో నెట్టివేస్తున్నారు. కొంత మంది సెల్ఫీలు, రీల్స్ పిచ్చిలో పడి డెంజరస్ స్టంట్ లు చేస్తున్నారు.
ఎత్తైన ప్రదేశాలు, క్రూర జంతువులు మొదలైన ప్రదేశాల్లో వెళ్లి నానా రచ్చ చేస్తున్నారు. ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోవాలని వాళ్లు చేస్తున్న పనులు చూస్తుంటే, జనాలు భయపడిదూరంగా పారిపోతున్నారు. ఈ క్రమంలో ఒక యువతి కారు రోడ్డు మీద నడ్పితే ఏం మజా ఉంటుంది.. పట్టాలపై ఎందుకు నడిపించొద్దని అనుకున్నట్లు ఉంది.
Car on Railway track!!
Woman drives car on railway track towards #Hyderabad. Despite railway staff attempting to stop her, she speeds off the car on the track.
As a precaution Railway officials halted Bengaluru-Hyderabad trains.
Authorities investigating into the incident pic.twitter.com/FP0vHCfQ2q
— Aneri Shah Yakkati (@tweet_aneri) June 26, 2025
వెంటనే పట్టాల మీదకు కారు ఎక్కించేసి మరీ రయ్ రయ్ అంటూ.. హైదరాబాద్ వైపుకు డ్రైవింగ్ చేస్తు వెళ్లిపొయింది. దాదాపు.. 8 కి.మీల దూరం వెళ్లింది. ఈ ఘటన..రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో చోటు చేసుకుంది.
రీల్స్ మోజులో పడి.. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై యువతి కారు నడిపిస్తు రచ్చ చేసింది. అప్పటికే ఆమెను అక్కడున్న రైల్వే సిబ్బంది వారించారు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఇంతలో ఎదురుగా ఒక ట్రైన్ వచ్చింది. లోకో పైలేట్ ఆమెను గమనించి ట్రైన్ ను ఆపేశాడు. స్థానికులు కూడా వారించడంతో.. యువతి కత్తి పట్టుకుని వారిని బెదిరించింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె చేసిన ఈస్టంట్ వల్ల.. ఆ మార్గంలో రైళ్లు గంటల తరబడి ఆలస్యం అయ్యాయి. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook