
Rajiv Yuva Vikasam Eligibility: వెనుకబడిన ఎస్సీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. 'రాజీవ్ యువ వికాసం' ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మార్చి 17వ తేదీన 'రాజీవ్ యువ వికాసం పథకం' సంబంధించిన పోర్టల్ కూడా ప్రారంభమైంది. అయితే ఏప్రిల్ 5వ వరకు ఈ దరఖాస్తు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఎంపికైన నిరుద్యోగులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన నిధులు మంజూరు చేస్తారు.
'రాజీవ్ యువ వికాసం' పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందేందుకు రూ.4 లక్షల వరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇందులో 80% వరకు రుణ రాయితీ కూడా ఉంది. 'రాజీవ్ యువ వికాసం' పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఈ పత్రాలు కలిగి ఉండాలి. ప్రధానంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో లబ్ధిదారుని ఫోన్ నెంబర్, ఆదాయ ధ్రువీకరణ, రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. అయితే రాజీవ్ యువ వికాసం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం కుటుంబంలోని ఒకరికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి.
ప్రధానంగా ఎడ్ల బండ్లు, ఆయిల్ ఇంజిన్ పంప్ సెట్, ఎయిర్ కంప్రెసర్, పత్తి సేకరణ యంత్రం, వేరుశనగ మిషన్, వర్మీ కంపోస్ట్, ఆయిల్ ఫామ్ వంటి ఉపాధి వ్యవసాయ అంశాలకు సంబంధించిన అంశాల్లో ఈ రుణాలు అందిస్తారు. పశుపోషణకు సంబంధించి గేదెలు, ఆవుల పెంపకం, డైరీ ఫార్మ్, కోడిగుడ్ల వ్యాపారం, చేపలు మేకల పెంపకం, పాల వ్యాపారం, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కులాల నిరుద్యోగులకు సొంత వ్యాపారం చేసుకునే ఈ అవకాశం కల్పించారు.
ఆటోమొబైల్ షాప్ నిర్వహణ, స్టీల్ వ్యాపారం, ఎయిర్ కూలర్, గాజుల దుకాణంతోపాటు హెయిర్ కటింగ్ షాపు, బ్యూటీ పార్లర్, బట్టల తయారీ, జనరల్ స్టోర్, ఇటుకల తయారీ, డిష్, టీవీ, వడ్రంగి సీసీ కెమెరాలు రిపేర్ షాప్, ఇది కాకుండా గోల్డ్ షాప్, జనరేటర్ షాప్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్ తో పాటు లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్, లేడీస్ కార్నర్, మినీ సూపర్ బజార్, మటన్, చికెన్ షాప్ లతో పాటు పేపర్ బ్యాగులు తయారీ వరకు అన్ని వ్యాపారాలు చేసుకునేందుకు ఈ రుణాలను అందిస్తోంది.
https://tgobmms.cgg.gov.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2వ తేదీ లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జాబితాను విడుదల చేస్తారు. రూ.2 లక్షల వరకు రుణం పొందితే 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంటే 70 శాతం వరకు ప్రభుత్వ రాయితీ పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి