Daughter Last Rituals To Father: పుత్రుడు తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి రక్షించేది అని అంటారు. కానీ ఈ కొడుకు మాత్రం తండ్రిని నరకంలోకి తీసుకెళ్లేలా ప్రవర్తించాడు. ఆస్తి కోసం సొంత తండ్రికి తలకొరివి పెట్టలేదు. తండ్రి కన్నా ఆయన సంపాదించిన ఆస్తి ఎక్కువ కావడంతో.. ఆస్తి తగదాలతో తండ్రి అంత్యక్రియలకు రాలేదు. తలకొరివి సంగతి పక్కన పెడితే కనీసం తండ్రిని చివరి చూపు చూసేందుకు కూడా రాలేని ఆ కొడుకును ఏమనాలి? కుటుంబ బంధాలు ఆర్థిక బంధాలు అవుతున్నాయని ఆందోళన చెందాలా? కని పెంచి పెద్ద చేసి భారీగా ఆస్తులు ఇచ్చిన ఆ తండ్రిపై ప్రేమప్యాయత లేకుండా ఆ కొడుకు ఆస్తి కోసం దారుణంగా ప్రవర్తించాడు. చివరకు అతగాడు రాకపోవడంతో కన్న కూతురు తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన కన్నీరు పెట్టిస్తోంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Raj Tarun Lavanya: రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. లావణ్యపై తల్లిదండ్రుల దాడి
ఆ తండ్రికి.. ఇద్దరు కూతుళ్లు.. ఓ కుమారుడు. తండ్రి తనువు చాలిస్తే హైందవ సంప్రదాయం ప్రకారం కొడుకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత. కానీ ఆ తండ్రి తన పేరిట ఉన్న ఇంటిని తనకు కాకుండా తన అక్కకు రాసిచ్చాడనే కోపంతో ఆ కొడుకు తండ్రి కర్మకాండల సంగతి అటునుంచి.. కడసారి చూపుకు రాలేదు. బంధువులు.. మిత్రులు బతిమిలాడినా ఆ కఠిన హృదయం కరగలేదు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి రిటైరయ్యారు.
Also Read: Love Marriage Murders: ఏపీలో ప్రియురాళ్ల వరుస హత్యలు.. ప్రేమ పెళ్లి అంటేనే హడల్
మాణిక్యరావు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉండగా వారికి వివాహాలు జరిపించి ఆర్థికంగా స్థిరపడేలా చూసుకున్నాడు. భార్య గతంలోనే మరణించడంతో.. తనకున్న ఆస్తిలో స్వగ్రామం క్యాతన్‌పల్లిలో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ పొలం, రూ.60 లక్షల నగదు తన కొడుకు గిరీశ్‌కి మాణిక్యరావు ఇచ్చాడు. ఇక మహబూబ్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని పెద్ద కూతురు రాజనందిని పేరిట రాసి ఇచ్చాడు. కన్నుమూసే వరకు ఇద్దరు బిడ్డల సంరక్షణలో మాణిక్యరావు ఉన్నారు. కొడుకు గిరీశ్ తనకు ఆస్తి తక్కువ ఇచ్చారని తండ్రిని పట్టించుకోవడం మానేశాడు. కుమార్తెలతో ఉంటున్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం కన్నుమూశాడు.
ఈ విషయాన్ని హైదరాబాద్‌లో నివసిస్తున్న గిరీశ్‌కు సమాచారం ఇవ్వగా తాను రాలేనని కుండబద్దలు కొట్టాడు. 'ఇంటిని నాకు కాకుండా చేశాడు .. నేను అంత్యక్రియలకు రాను' అని గిరీశ్ తెగేసి చెప్పడంతో ఆ అక్కాచెల్లెళ్లు బోరున విలపించారు. 'ఆ ఇంటిని ముగ్గురం సమానంగా తీసుకుందాం.. నాన్న అంత్యక్రియలు నిర్వహిద్దాం రా' అంటే కూడా గిరీశ్ గుండె కరగలేదు. బంధువులు, మిత్రులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఫోన్లు చేస్తే కట్ చేస్తున్నాడు. ఇక బంధుమిత్రుల సలహా మేరకు చిన్న కుమార్తె రఘునందిని తండ్రికి తలకొరివి పెట్టింది.
మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు
చిన్న కూతురు రఘునందిని అంతిమ యాత్ర ముందు నడిచి.. తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రిపై మమకారం కన్నా.. ఆస్తికే ప్రాధాన్యతను ఇచ్చిన కొడుకు తీరుపై సమాజం మండిపడుతోంది. మానవ బంధాలు ఆర్థిక బంధాలు అవుతున్నాయని చెప్పడానికి మహబూబ్‌నగర్ సంఘటన ఒక మచ్చుతునక. మాయమవుతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాటకు ఈ సంఘటనను చూస్తే నిజమేననిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









