)
Etela rajender first reaction to the cbi investigation into the kaleshwaram project: తెలంగాణలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం రాజకీయాంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పై ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ కూడా మూకుమ్మడిగా ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోక వచ్చిన తర్వాత కాళేశ్వరంపై పీసీఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇటీవల కమిషన్ తెలంగాణ ప్రభుత్వంకు నివేదిక ఇచ్చింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి చర్చలు కూడా జరిపింది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరంపై ప్రజాస్వామ్య బద్దంగా అన్నిపార్టీల విధానాల్ని తెలుసుకునేందుకు కాళేశ్వరంను అసెంబ్లీలో పెట్టి చర్చించినట్లు చెప్పుకొచ్చింది. మరోవైపు 9 గంటల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదంను సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణను సీబీఐ కి అప్పగించడం పట్ల మీడియాతో మాట్లాడుతూ..#KaleshwaramProject #CBI pic.twitter.com/VYk2otMjpa
— Eatala Rajender (@Eatala_Rajender) September 1, 2025
రాహుల్ గాంధీ సీబీఐ నహీ అంటే.. రేవంత్ మాత్రం సీబీఐ కావాలని అంటున్నాడని అన్నారు. అంతేకాకుండా మండలిలో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతులు చింపి మండలి చైర్మన్ పై విసిరారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదంను సీబీఐతో దర్యాప్తు చేయించడంను స్వాగతించారు. తాము గతంలో సీబీఐతో విచారణ జరిపిస్తే అసలు నిజాలు బైటకు వస్తాయని చెప్పామన్నారు.
ఈ క్రమంలో కాళేశ్వరంపై హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి కోర్టులో కూడా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం సీబీఐకి అప్పగింతపై ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. ఇటీవల కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సీబీఐకు అప్పగించి మంచి చేసిందన్నారు.
అసలు వాళ్లకు దీనిపై వాళ్లకు చర్యలు తీసుకొవడం చాతకాదని రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. వారి రిపొర్టు తప్పుల తడకన్నారు. అంతే కాకుండా ఈ రిపోర్ట్ నిలవదని తెలసి.. సీబీఐకు అప్పగించారన్నారు. కానీ సీబీఐ మాత్రం సంపూర్ణంగా విచారణ చేపట్టి, అక్రమాల్ని వెలికి తీస్తుందని కాళేశ్వరం రిపోర్టుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.