Ex CM KCR: అసెంబ్లీలోకి కేసీఆర్ ఎంట్రీ.. ఎక్కడ కూర్చున్నారో తెలుసా..!

Telangana Assembly Budget Session 2025: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈసారి హాట్‌ హాట్‌గా సాగనున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరు కావడంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరగనుంది. నేడు గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడనుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 12, 2025, 11:31 AM IST
Ex CM KCR: అసెంబ్లీలోకి కేసీఆర్ ఎంట్రీ.. ఎక్కడ కూర్చున్నారో తెలుసా..!

Telangana Assembly Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్టుదేవ వర్మ ప్రసంగించారు. దాదాపు గంటపాటు గవర్నర్‌ ప్రసంగం ఉండే అవకాశం ఉంటుంది. అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. ఈ సమావేశాలు ఈ నెల 27 వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వాయిదా అనంతరం బీఏసీ మీటింగ్‌లో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తారు. కాగా.. 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు సహా ఇతర బిల్లులు అసెంబ్లీ కౌన్సిల్ ముందుకు రానున్నాయి. 

Add Zee News as a Preferred Source

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి. శాసనసభ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడని తెలుసుకొని.. ట్రాఫిక్  జామ్ కావడంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మెట్రోలో అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి 500 బోనస్ ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. 

మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ లెజిస్లేచర్ పార్టీ (BRSLP) మీటింగ్ మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి 15 నెలల సమయం ఇచ్చామని.. అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఎలా ఉందో సభలో ప్రస్తావించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దిగజారుతున్న పరిస్థితులపై అధికార పార్టీని ప్రశ్నించాలని ఆదేశించారు. రైతు కష్టాలు, విద్యుత్ కొరత, నీటిపారుదల వైఫల్యాలు, కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి కఠినమైన వ్యూహాలను ఆయన వివరించారు. పంటలు ఎండిపోవడం, మోటార్లు తగలబెట్టడం, నీటిపారుదల నీటి కొరత, తాగునీటి కొరత, గురుకుల పాఠశాలలు, ప్రజా సేవలలోని పేలవమైన పరిస్థితులపై నిలదీయాలని చెప్పారు. 

మరోవైపు బీఆర్ఎస్‌వీ నేతలు అసెంబ్లీ ముట్టడి ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు  అరెస్ట్ చేశారు. విద్యా శాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సంస్థల్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధులు కేటాయించాలని ముట్టడించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి నివాసంతో పాటు మంత్రుల ఇల్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News