KCR Meeting: 'కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడండి'.. పార్టీ సభ్యులకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశం

Ex CM KCR Called Fight For Public Problems In Assembly: తెలంగాణ రాజకీయాలపై మాజీ మఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నింట్లో తీవ్ర వైఫల్యం చెందిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ ఆదేశించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 11, 2025, 11:29 PM IST
KCR Meeting: 'కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడండి'.. పార్టీ సభ్యులకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశం

BRS Party LP Meeting: పరిపాలనాపరంగా తీవ్రంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రేవంత్‌ రెడ్డిపై పోరాటం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సూచించారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై.. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ మీద రాష్ర్ట  ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పికొట్టాలని మార్గనిర్దేశం చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: Amrutha Pranay: భర్త హత్య కేసు తీర్పుపై నోరు విప్పిన అమృత ప్రణయ్‌.. 'అర్థం చేసుకోండి'

హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ, మండలి సభ్యులతో గులాబీ అధినేత కేసీఆర్‌ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు చేశారు. సభ్యులందరూ సభా సమయానికి నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. 'రాష్ర్టంలో నెలకొన్న సమస్యలు.. ఎండిన పంటలు.. అందని విద్యుత్‌, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతుల సమస్యలపై, తాగునీటి కొరతపై అసెంబ్లీ, మండలిలో పోరాడాలి' అని మాజీ సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశం చేశారు.

Also Read: K Kavitha: 'పసుపు రైతులు కన్నీళ్లు పెడుతుంటే రేవంత్‌, ధర్మపురి అర్వింద్‌ ఏం చేస్తున్నారు?

'బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్.. డీఏల పెండింగ్‌.. పీఆర్సీ అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి' అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ సూచించారు. మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని  కొట్లాడాలని చెప్పారు. ఆరు గ్యారంటీ ల అమలు లో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని సూచించారు.

'విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. దళితబంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలి. గొర్రెల పెంపకం.. చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలి' అని సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు.. వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా ప్రభుత్వాన్ని పశ్నించాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News