)
Kavitha Deeksha: విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం కల్పించాలని కోరుతూ 72 గంటల నిరాహార దీక్షకు దిగింది ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ లోని మెంట్ కాంపౌండ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి ఫూలే విగ్రహాలకు, ట్యాంక్ బండ్ పైన భారత్ రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకుపూల మాలలు వేసి నివాళులర్పించారు కవిత. ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ కవిత దీక్షకు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉందని తెలిపారు. 72 గంటల దీక్ష కు అనుమతి ఇవ్వని పోలీసులు. ఈ దీక్ష ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలని ఒత్తిడి తెచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లులు తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ధర్నాకు పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
ఈ దీక్ష ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆమోదంను వేగవంతం చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. కవిత ఈ దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. అయినా కవిత దీక్షకు దిగుతానని చెప్పడంతో ఏ్ జరుగుతుందో నన్న ఉత్కంఠ నెలకొంది. అయితే పోలీసులు మాత్రం ఒకరోజు దీక్షకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. కాగా తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఇతర బీసీ సంఘాల కార్యకర్తలు ఈ దీక్షకు ఏర్పాట్లు చేసారు.
దీనిపై కాంగ్రెస్ నేతలు కవితను పలు ప్రశ్నలు సంధించారు. కవిత... ఏ హోదాతో ఈ దీక్ష చేస్తుందో చెప్పాలన్నారు. నీ దీక్ష ఎవరికీ లాభం చేకూరడానికి చేస్తున్నట్టు ప్రశ్నించారు. హైదరాబాద్ లో కాకుండా దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని చెప్పారు. ఢిల్లీలో దీక్ష చేయాలంటే కేంద్రం అంటే భయమా అని ప్రశ్నించారు. నీ దీక్షకు మీ పార్టీ బీఆర్ఎస్ మద్దతు ఉందా అని ప్రశ్నించారు. మీ పార్టీలో మీపై కుట్ర చేస్తోన్న ఆ పెద్ద లీడర్ ఎవరని ప్రశ్నించారు. మీ అమ్మ, నాన్నల ఆశీర్వాదం తీసుకోకుండా అత్త, మామల ఆశీర్వాదం ఎందుకు తీసుకున్నావు అని టీపీసీసీ ప్రశ్నించింది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మా సీఎం సెంటర్ తో తో పోరాటం చేస్తున్నది నిజమా కాదా ? కవిత చెప్పాలన్నారు. అంతేకాదు 42 బీసీ రిజర్వేషన్ లపైన మా ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉందా లేదా? అనేది కూడా ఈ సందర్భంగా కవిత చెప్పాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.