BRS Party Silver Jubilee Celebrations: పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండడం.. ఉద్యమ పార్టీగా పద్నాలుగేళ్లు.. అధికార పార్టీగా పదేళ్లు పరిపాలించి.. ప్రతిపక్ష పార్టీగా ఏడాది ముగించుకున్న బీఆర్‌ఎస్ పార్టీ సంబరాలకు సిద్ధమైంది. రజతోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ బాస్ ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రజతోత్సవ బహిరంగ సభపై పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: K Kavitha: 'వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పారిపోయారు'
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో శనివారం రజతోత్సవ బహిరంగ సభపై సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నాయకుల కేసీఆర్ సమావేశమయ్యారు. రజతోత్సవ కార్యక్రమాలు.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఎలా సన్నద్ధం కావడంపై కేసీఆర్ పార్టీ నాయకులకు వివరించారు. పార్టీ నాయకులతోపాటు ప్రజలను బహిరంగ సభ తరలించడంతోపాటు రజతోత్సవ సంబరాలు ఎలా నిర్వహించాలనే దానిపై పార్టీ నాయకులతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశాలతో అన్ని జిల్లాల నాయకులతో సమావేశాలు పూర్తయ్యాయి.
ఉమ్మడి పాలమూరు నాయకులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రులు సీహెచ్ లక్ష్మారెడ్డి, సింగిరెడి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి,పార్టీ నాయకులు డాక్టర్ ఆంజనేయ గౌడ్, హనుమంతు నాయుడు, గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు
ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదుర్కొన్న ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రతృక దృష్టి సారించారు. ఈ జిల్లా నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బానోత్ మదన్ లాల్, బానోత్ హరిప్రియ నాయక్, రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వర్ రావు, వనం వెంకటేశ్వర రావు, లింగాల కమల్ రాజ్
తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు...
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాడుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ జిల్లా నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెమేల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు విజయ సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు కూడా హాజరయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









