)
Ugadi 2025 Festival: తెలుగు వారి కొత్త సంవత్సరం.. నవ వసంతం వచ్చేసింది. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రజలకు అంతా మంచి జరగాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. 'ప్రకృతితో మమేకమై.. వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు.. ఉగాది గొప్ప పర్వదినం' అని కేసీఆర్ తెలిపారు.
ప్రజలకు ఉగాది శుభకాంక్షలు చెబుతూ కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. 'రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారు. వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుంది' మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వివరించారు.
'ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో.. ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉంది. చెట్లు పచ్చగా చిగురిస్తూ.. ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుంది. అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలి' అని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కోరుకున్నారు. రైతులు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశించారు. అప్పుడే విశ్వావసు నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని కేసీఆర్ తెలిపారు.
ఉగాది పచ్చడి మాదిరి.. జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి.. సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతి మాతను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రార్థించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe