Telangana Budget Sessions: గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. ఈ సారి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాబోతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక.. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. గతంలో తన ప్రమాణ స్వీకారం రోజున ఒకసారి.. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భగా రెండోసారి మాత్రమే సభకు వచ్చారు.. ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.. అప్పట్లో కేసీఆర్ శాసనసభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించినా కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పలువేదికలపై ప్రస్తావించి బీఆర్‌ఎస్‌పార్టీని ఇబ్బందుల్లోని నెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది..
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి జైలుకు పంపించారు. ఆ తర్వాత తన కుమార్తె పెళ్లికి కూడా రేవంత్ రెడ్డి బెయిల్ వచ్చే పరిస్థితిని కల్పించారు. అప్పటినుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ సీన్ మారిపోయింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా పగ తీర్చుకున్నారని విమర్శలు ఉన్నాయి.
కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావు తదితర నేతలు కాంగ్రెస్ సర్కార్‌తో అసెంబ్లీలో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. కేసీఆర్ రావాలని, తగిన సూచనలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. అయినా కేసీఆర్ పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
తాజాగా రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్ధిగా పోటీ చేసిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఓడిపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వుందనేందుకు… ఇటీవల పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 12 నుంచి మొదలుకానున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వెళ్లాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతుండటంతో.. సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతాయని ప్రచారం సాగుతోంది. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాక సభను సజావుగా అధికార పార్టీ నేతలు సాగనిస్తే బాగుంటుంది. ఒకవేళ అలా జరగకుండా.. వ్యక్తిగత దూషణలకు దిగితే మాత్రం కేసీఆర్ ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Also Read: TGPSC Group 1 Results: టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోవడం ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitte









