KCR: గులాబీ బాస్‌ టార్గెట్‌ వెనుక అసలు కారణం ఇదే.. మాములు ప్లాన్ లేదుగా..!

BRS Public Meeting: బీఆర్‌ఎస్‌ ప్లీనరీని సక్సెస్ చేయాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ భావిస్తున్నారా..! మొత్తం 10 లక్షల మందితో ఓరుగల్లు సభను గ్రాండ్‌ సక్సెస్‌ చేయాలని అనుకుంటున్నారా..! ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఓరుగల్లు సభకు జనం తరలివచ్చేలా నేతలకు టార్గెట్‌ పెట్టారా..! అయితే గులాబీ బాస్‌ టార్గెట్‌ వెనుక అసలు కారణం వేరే ఉందా..!   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 11, 2025, 07:29 PM IST
KCR: గులాబీ బాస్‌ టార్గెట్‌ వెనుక అసలు కారణం ఇదే.. మాములు ప్లాన్ లేదుగా..!

BRS Public Meeting: తెలంగాణలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు బీఆర్‌ఎస్‌ సిద్దమవుతోంది.. ఈనెల 27 న ఓరుగల్లులో ప్లీనరీని సక్సెస్ చేసేందుకు గులాబీ బాస్‌ రెడీ అయ్యారు. ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశం అవుతున్న కేసీఆర్‌.. ఓరుగల్లు సభను సక్సెస్ చేయాలని దిశానిర్ధేశం చేశారు. కనీసం ప్లీనరీకి 10 లక్షల మందిని తరలించాలని, ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలన నేతలను ఆదేశించినట్టు తెలిసింది. గతంలో బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉండగా.. సభలన్నీ ఎంతో గ్రాండ్ సక్సెస్‌అయ్యాయి. కానీ రాష్టంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటింది. దాంతో సభకు జనం రారనే భయం గులాబీ బాస్‌ను వెంటాడుతోందట. అందుకే తనతో సమావేశమైన నేతలకు కేసీఆర్‌ కొత్త టార్గెట్‌లు పెట్టినట్టు తెలుస్తోంది.. 

Add Zee News as a Preferred Source

ఈనెల 27న వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్లీనరీ జరిగే ప్రాంతాన్ని ఓరుగల్లు బీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించారు. అంతకుముందు వివిధ జిల్లాల నేతలతో గులాబీ బాస్‌ భేటీ అయ్యారు. తొలుత వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్‌..  ప్లీనరీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోట.. ప్లీనరీతో మరోసారి ఈ విషయం తెలిసే ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. గులాబీ పార్టీ ప్లీనరీ ప్రతిఒక్కరికి గుర్తుండేలా చూడాలని నేతలను కోరారు. అంతకుముందు నల్గొండ, కరీంనగర్ జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించి.. దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్‌ కొత్త టార్గెట్‌ పెట్టినట్టు తెలుస్తోంది. సభకు ఎంత ఎక్కువ మందిని తరలిస్తే.. వారికి అంతా పెద్ద పోస్టు ఇస్తానని బంపరాఫర్ ప్రకటించారట. అలాగే ప్లీనరీ ముగియగానే.. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పోస్టులు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. 

ఆ తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పార్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరలు సైతం పాల్గొన్నారు. ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అనంతరం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈనెల 27న వరంగల్ లో జరగనున్న బహిరంగ సభ , పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై వారితో చర్చించారు. వీరికి కూడా కొత్త టార్గెట్‌పెట్టినట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారట. ప్రతిగ్రామం నుంచి తక్కువలో తక్కువ పది వాహనాలు ఉండేలా చూడాలని చెప్పారట. అంతేకాదు ఎక్కువ మందిని తరలించిన నేతలకు కీలక పదవులు దక్కుతాయని చెప్పారట. అయితే కేసీఆర్‌ మాటలు వని తలలు ఊపిన నేతలు.. ఈ కొత్త టార్గెట్‌ ను ఎలా రీచ్‌ అవ్వడమా అని క్యాడర్‌ను ఉరుకులు పరుగులు పెట్టించే పనిలో బిజిబిజీ అయినట్టు తెలుస్తోంది. 

అయితే కేసీఆర్‌ టార్గెట్‌ పెట్టడం వెనుక కారణాలు అసలు సిసలైన రాజకీయం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. గతంలో పదేళ్లు అధికారంలో ఉండగా.. బీఆర్‌ఎస్‌ సభలకు వద్దన్నా జనం వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా కంట్రోల్‌ తప్పింది.. ఇప్పుడు గ్రామస్థాయిలో కూడా పార్టీపై వ్యతిరేకత ఉంది. కాబట్టి సభను సక్సెస్ చేయాలంటే.. నేతలకు కొత్త టార్గెట్‌ పెట్టక తప్పని పరిస్థితులు ఉన్నాయట. కనీసం 10 లక్షలు టార్గెట్‌గా పెడితే.. 2 లక్షల మంది సభకు వచ్చినా సక్సెస్‌ అయినట్టేనని లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు హైదరాబాద్‌, చుట్టు పక్కలా జిల్లాల నుంచి ఎక్కువమందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి మరి ఆధ్వాన్నంగా ఉంది. అటు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు జంప్‌ అయ్యారు. దాంతో సభకు జనాలను తరలించడం పార్టీ నేతలకు కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. 

మొత్తంమీద ఏడాదిన్నరగా సైలెంట్‌ ఉన్న గులాబీ బాస్‌.. ప్లీనరీని సక్సెస్‌ చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు నేతలను కలిసేందుకు ఆసక్తి చూపించని కేసీఆర్‌.. ఇప్పుడు నేతలను పిలిపించుకుని మరి సమాలోచనలు చేస్తున్నారు. దాంతో పార్టీ నేతలు కూడా ప్లీనరీని సక్సెస్ చేస్తామని అధినేత ముందు బల్లగుద్దిమరి చెబుతున్నారట. అంతేకాదు తమ తమ నియోజకవర్గాల్లో సైలెంట్‌గా ఉన్న క్యాడర్‌లో కొత్త జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.. ఏదీఏమైనా బీఆర్‌ఎస్ ప్లీనరీతో పార్టీకి పూర్వ వైభవం కాయమని గులాబీ బాస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: Tamil Nadu Girl: విద్యార్థినికి పీరియడ్స్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజం.. సీరియస్ అయిన ఖుష్బూ..

Also Read: China US Trade war: 'నీ బొంద మావా..' ట్రంప్ కి ఇండియా ఝలక్.. టారిఫ్ వార్ తో పంట పండింది పో  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News