Ex CM KCR: గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నుంచి బరిలో దిగిన కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలై.. గజ్వేల్‌లో మాత్రం విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన ఏడాదిన్నరగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తున్న.. వెంటనే ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోతున్నారు.. కానీ.. కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి లేరని.. బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు తాళం వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజంగానే కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేరా అనే చర్చ మొదలైంది..
తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు. ఏడాదిగా నియోజకవర్గంలో సమస్యలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న కొంత కాలంగా ఎవ్వరూ అందుబాటులో లేకుండా పోయారని మండిపడ్డారు. అంతేకాదు కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూడా రావడం లేదని నిరసనకు దిగారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గేటుకు టూలెట్, వాంటెడ్ బోర్డులను అతికించి ఆందోళనకు చేపట్టారు. అయితే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న.. ప్రజలను కలవడం లేదన్న చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలు అంతే రేంజ్‌లో ఆన్సర్ ఇచ్చారు.
ఇక గజ్వేల్‌లో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించడంపై బీఆర్ఎస్ లీడర్ వంటేరు ప్రతాప్ రెడ్డి సీరియస్ అయ్యారు. కొంతమంది అల్లరి ముకలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడి చేశారని ఆరోపించారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో 50 ఏళ్లు ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. అసలు రాజకీయ పరిజ్ఞానం లేని అల్లరి మూకలు కార్యాలయాన్ని మట్టడించడాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు ధర్నా చేయాలని అనుకుంటే సెక్రటేరియట్‌కు వెళ్లి చేసుకోవాలని మండిపడ్డారు. అసలు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచి ఏడాది అయ్యిందని కానీ గజ్వేల్‌లో కనీసం కొబ్బరికాయ కొట్టి ఒక్క అభివృద్ధి పనైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు.
మొత్తంగా గజ్వేల్‌లో ప్రజా సమస్యలు తీర్చాలని డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి వినతులు స్వీకరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచి ఏడాది పూర్తయినా.. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో లేరని విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో ప్రజల కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తానని చెప్పి ఇప్పుడు మరిచిపోయారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా క్యాంపు కార్యాలయానికి టు లెట్ బోర్డు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కానీ బీజేపీ నేతల ఆందోళనను గులాబీ పార్టీ సీరియస్‌గా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే వెంటనే వంటేరు ప్రతాప్ రెడ్డిని రంగంలోకి దింపింది.
Also Read: Group 1 Mains: తెలంగాణ గ్రూప్ 1లో బిగ్ ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









