)
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నివాసాలపై పోలీసులు తనిఖీలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరిస్తోందని.. దీనిపై ఎన్నికల సంఘం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అన్ని శాఖలను తన వద్ద పెట్టుకున్న రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని ప్రకటించారు.
బీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్థన్ రెడ్డి, రవీందర్ రావు ఇంటిపై పోలీసులు దాడులు చేయగా.. వాటిని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలపై 20 ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా, విద్యామంత్రిగా, మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అని హరీశ్ రావు వెల్లడించారు.
'సొంత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డికి పట్టు లేదు. రోజుకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఢిల్లీకి ఉత్తరాలు రాస్తున్నాడు. రేవంత్ రెడ్డి హయాంలో క్రైం రేటు పెరిగింది. కమీషన్ల కోసం కమాండ్ కంట్రోలు సెంటర్లో రేవంత్ రెడ్డి సమీక్షలు చేస్తున్నాడు.బీజేపీ 8ఎంపీలు గెలిచినా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా. బీజేపీ ఇవ్వదు.. రేవంత్ రెడ్డి కొట్లాడడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'నవీన్ యాదన్ తమ్ముడు వెంకట్ యాదవ్ కు మూడు ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినా కిషన్ రెడ్డికి పట్టదు.. బీజేపీ అడగదు' అని అసహసనం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రధాని చెప్పిన త్రిబుల్ ట్యాక్సపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలసి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు? అని నిలదీశారు. కాంగ్రెస్ లేకుంటేముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ అన్యాయమని.. ముస్లింలను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి