)
Congress Dues Card: 'ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75 వేల రూపాయలు రైతుబంధు బాకీ పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు బాకీ పడ్డ రూ.44 వేలు ఇచ్చి ఓట్లు అడగాలి. ఊరూరా బెల్టు షాపులు మైక్రోబ్రూవరీలు పెట్టి తాగుబోతుల తెలంగాణగా రేవంత్ రెడ్డి మారుస్తున్నాడు. కేసీఆర్ తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లు ఫీజు రీయంబర్స్మెంట్ డబ్బు చెల్లిస్తే.. ఒక రూపాయి చెల్లించని చేతకాని రేవంత్ రెడ్డి' అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతు కోసిందని చెప్పారు. 'కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతుబంధు, కల్యాణ లక్ష్, విద్యార్థులకు ఫీజు రీయంబర్మెంట్, చివరికి కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ బంద్' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి హరీశ్ రావు ఏకరువు పెట్టారు. గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంక బిందెలకు రేవంత్ రెడ్డి వేట పట్టాడని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డును మంగళవారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి తప్పిదాలు, వైఫల్యాలు, అవినీతి చిట్టా విప్పారు. ఈ సందర్భంగా పండుగ సమయంలో ప్రజలంతా రేవంత్ రెడ్డి మోసాలపై చర్చించాలని సూచించారు. 'కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నట్లు' బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు వెల్లడించారు.
'వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారు. కాంగ్రెస్ మోసాలు, కాంగ్రెస్ పాలనను, రేవంత్ రెడ్డి దగాను ఎండగట్టాలి. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి' అని ప్రజలకు మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. 'రైతుబంధు ఇప్పుడైతే రూ.10 వేలు మేము వస్తే రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని రూ.12 వేలు ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఎగ్గొట్టిండు' అని వివరించారు. ప్రతి రైతుకు రేవంత్ రెడ్డి రూ.75 వేలు రైతుబంధు బాకీ పడిందని గుర్తుచేశారు.
'రైతుబంధు రైతుకి ఇస్తాం. కౌలు రైతుకు ఇస్తామన్నారు. ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెద్ద పెద్ద రైతులకు మాత్రమే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నారు అని అన్నీ అబద్దాలే చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడని నిలదీశారు. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని రేవంత్ రెడ్డికి అర్థమైందని చెప్పారు. 'రూ.200 ఉన్న పెన్షన్‌ని కేసీఆర్ రూ.2 వేలు చేసిండు. కానీ కాంగ్రెస్ ఇస్తానన్న రూ.4 వేలు ఇంతవరకు లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
'అత్తకు, కోడలు ఇద్దరికీ ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ గజినీకాంత్ మాటలు. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి రూ.44 వేలు బాకీ పడ్డాడు. రూ.44 వేలు ఇచ్చాకే కాంగ్రెస్ వాళ్లు ఎవరైనా ఓటు అడగాలి. అంతా మోసం.. గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి పంచారు. వంద రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు' అని రేవంత్ రెడ్డి మోసాలు, కాంగ్రెస్ పార్టీ దగాను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు వివరించారు.
మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని చెప్పి 30 క్యాబినెట్లైనా ఊసే లేదని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు చురకలు అంటించారు. ఇచ్చిన హామీల అమలు గురించి ఎవరైనా అడుగుతారేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం చూడడం లేదని తెలిపారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి విఫలమైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మోసాలకు బాకీ కార్డును విడుదల చేసినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ బాకీ కార్డు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం అని ప్రకటించారు. ఇది కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుందని జోష్యం చెప్పారు.
కొత్త ఓటర్లు ఆరు వేలు
సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేరారు. 663 మందిని తొలగించారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తుది ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉంది. దాదాపు నాలుగు లక్షలకు చేరువగా ఉన్న ఓటర్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook