)
Harish Rao vs Revanth Reddy: 'ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్లాన్' అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా రూ.15 వేల కోట్ల పనులు అప్పనంగా అప్పగిస్తూ మరో కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపాడని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు విలువ చేసే వేలాది ఎకరాల భూములను తన అనుయాయులకు దారాదత్తం చేసేందుకు రేవంతు మార్కు భారీ స్కెచ్ వేశారని తెలిపారు.
పర్యాటక కాన్క్లేవ్ పేరిట రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. 'ఓపెన్ బిడ్లు పిలవలేదు, అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదు' అని ఆరోపించారు. టెండర్లు పిలిచింది లేదు, నిబంధనలు పాటించింది లేదు.. కమీషన్లు దండుకునేందుకు వట్టి డంబాచారం, డబ్బా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
'ఇద్దరు, ముగ్గురిని మాత్రమే కన్సల్టెంట్స్గా పెట్టుకొని పనులను సీక్రెట్‌గా ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది? ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ప్రభుత్వ భూములను, ప్రజా ధనాన్ని ఎవరికి దోచి పెడుతున్నారు?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 'లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్స్, వైన్ యార్డు రిసార్ట్స్, లగ్జరీ హోటల్స్, వాటర్ ఫ్రంట్ రిసార్ట్స్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్కుల అభివృద్ది పేరిట మీరు చేస్తున్నది ముమ్మాటికీ కుంభకోణం. కమీషన్ల దందానే' అని తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి కొత్త కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతామని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని జోష్యం చెప్పారు. ఈ దోపిడీలో భాగమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ మొత్తం కుంభకోణంపై విచారణ చేయిస్తామని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook