)
Bathukamma Celebrations: సిద్దిపేట కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, సతీమణి శ్రీనితతోపాటు కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీనిత మహిళలలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 'రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ, విదేశాల్లో ఎంతో గొప్పగా ఈ పండుగను చేసుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించింది' అని తెలిపారు.
బతుకమ్మ పండుగకు సైన్స్ కూడా ఉందని.. ముఖ్యంగా వర్షాకాలంలో చెరువుల్లోకి కొత్త నీరు వచ్చినప్పుడు ఆ నీటిని శుద్ధిపరచడానికి తంగేడు పువ్వు, గునుగు పువ్వు వంటి వివిధ రకాల పువ్వులు వేసినప్పుడు. చెరువు శుభ్రం అవుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. ఇంత గొప్ప సంస్కృతి, సంప్రదాయం తెలంగాణకే దక్కిందని ప్రకటించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర అధికారిక పండుగగా చేశారని గుర్తుచేశారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ పండుగలకు గుర్తింపు దొరకలేదని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. ఇప్పుడు అమెరికా అయినా, లండన్ అయినా, దుబాయ్ అయినా ఎక్కడైనా కావచ్చు. అన్ని దేశాల్లో మన పండుగ గొప్పతనాన్ని తెలిసేలా తెలంగాణ ఆడపడుచులు చేశారని తెలిపారు. ప్రపంచమంతా మన ఆడపడచులు బతుకమ్మ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు.. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లలో మాజీ మంత్రి హరీశ్‌రావు కలియతిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎంతో ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా హరీష్ రావు కుటుంబ సమేతంగా బోటులో షికారు చేశారు. సద్దుల బతుకమ్మ సందర్బంగా కొమటి చెరువుపైకి సద్దులు తింటున్న వారితో హరీశ్ రావు ముచ్చటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook