Jagadish Reddy: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ గెలవదు

Jagadish Reddy vs Revanth Reddy: మానసిక స్థితి రేవంత్‌ రెడ్డికి దెబ్బతిన్నట్లుందని.. సందర్భం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామని గ్రహించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 8, 2025, 04:32 PM IST
Jagadish Reddy: జూబ్లీహిల్స్‌లో రేవంత్‌ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ గెలవదు

Jagadish Reddy vs Revanth Reddy: 'సిగ్గు కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడేలా ఉంది. నిఘా పెట్టడానికి కేసీఆర్ కమాండ్ కంట్రోల్ కడితే.. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్‌లో కూర్చుని మాపై నిఘా పెడుతున్నారా?' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. 'ప్రగతి భవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సచివాలయంపై కమిషన్ వేయవచ్చు కదా?' అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Bandi Sanjay: రేవంత్‌ రెడ్డి 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేస్తారా?: బండి సంజయ్‌

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్‌ను, సోనియాగాంధీని రేవంత్‌ రెడ్డి తిట్టాడని గుర్తుచేశారు. 'ప్రగతి భవన్‌కు పోదామా బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు చూపిస్తావా? ప్రగతి భవన్‌లో ఎన్ని రూములు ఉన్నాయో చూపిస్తావా?' అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్‌ చేశారు.

Also Read: Bandi Sanjay: విద్యార్థుల జీవితాలను రేవంత్‌ రెడ్డి బలి చేస్తావా? బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

'ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడతావు? రేవంత్ రెడ్డిలో భయం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పదవికి ఉపద్రవం వస్తుంది. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్‌లో ఎక్కువ తప్పులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలు బంద్ చెయ్యాలి' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసే తప్పులకు చరిత్ర క్షమించదని ప్రకటించారు.

Also Read: Udyogini Scheme: మహిళలకు ఈ పథకం ఓ వరం.. వడ్డీ లేకుండా రూ.3 లక్షలు ఇలా!

'నోటి దూలతో బీహార్ నుంచి వెళ్లగొట్టే పరిస్థితి వచ్చింది. బిహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మోడీ శిష్యులు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి భాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలి' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.

Also Read: Viral Video: హైదరాబాద్‌లో ఆటో డ్రైవ్‌ చేస్తూ అమ్మాయితో సరసాలు‌.. వీడియో వైరల్‌

మాగంటి గోపీనాథ్‌ తల్లితో ఎవరు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతో రేవంత్‌ రెడ్డి చేసే పనుల్లో ఇది ఒకటి అని తెలిపారు. 'రేవంత్ రెడ్డి డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నట్టు ఉంది. రేవంత్ రెడ్డి వచ్చాక డ్రగ్స్ సంబంధ నేరాలు ఎక్కువయ్యాయి. పోలీస్ కమిషనర్లే నేరాల రేటు పెరిగిందని చెప్పారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపారు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. 'రేవంత్ రెడ్డివి చిల్లరమాటలు. అతడి భాషతో తెలంగాణ పరువు పోతోంది. ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి భాష మార్చుకుంటే మంచిది' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హితవు పలికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News