)
Jagadish Reddy vs Revanth Reddy: 'ఫ్యూచర్ లేని ఫోర్త్ సిటీ. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఆయనకే తెలియదు. హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది. వేయి కోట్ల రూపాయలు చేతులు మారాయి' అని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.15 వేల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఆర్టీసీనే నడుపలేకపోతున్నారు.. ఇప్పుడు మెట్రోను నడుపుతారా? అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ తప్పిదాలపై సోమవారం బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 'ఓ పథకం ప్రకారం ఎల్ అండ్ టీపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారు. వేయి కోట్ల లాభం రేవంత్ రెడ్డి పొందాడు. హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. 35 వేల కోట్ల రూపాయల ఆస్తులను అదానీ, మేఘాకు కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. మరో రూ.వేయి కోట్ల కోసం ప్రణాళిక రచిస్తున్నారని చెప్పారు.
'తెలంగాణ రియల్ ఎస్టేట్ దందా నడుస్తోంది. ఇల్లు లేని దగ్గర రోడ్లు వేస్తున్నారు. మూర్ఖపు పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఆయనకే తెలియదు. అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే ట్రైన్లో వస్తారా?' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు. ఎన్నికలు జరుగతావి అని ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం లేదని ప్రకటించారు.
'రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు రిజర్వేషన్లు రావాలని రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ధర్నాలోనే చెప్పారు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. జాతీయ పార్టీ నాయకులు వచ్చి చెబితే ఎన్నికలప్పుడు ప్రజలు నమ్మరు.. బీసీ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజల పై రుద్దాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook