)
Governor Quota MLC Cancels: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వగా ఈ తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెంపపెట్టు అని ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని గుర్తుచేశారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు శిరస్సు వంచి సలాం చేస్తున్న అని కేటీఆర్ తెలిపారు.
గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నియమించిన కోదంరామ్ రెడ్డి, అమీర్ అలీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెంపపెట్టు అని మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ రెండు ఢిల్లీ పార్టీలు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తే నాటి గవర్నర్ చులకన చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. తమ ప్రభుత్వ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి తన బీసీ వ్యతిరేక వైఖరిని రేవంత్ రెడ్డి చాటుకున్నాడని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చర్యలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందని కేటీఆర్ ప్రకటించారు. ఈ తీర్పుతో బీజేపీ, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైందని తెలిపారు.
బీఆర్ఎస్ నామినేట్ చేసిన బలహీనవర్గాల అభ్యర్థులకు అడ్డుతగిలి, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిన బీజేపీ, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారం కోసం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కిన ఈ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని సుప్రీంకోర్టు తన తీర్పుతో చాటిచెప్పిందని వెల్లడించారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడిన బీఆర్ఎస్ పార్టీ గౌరవ న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.