Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నా రాష్ట్రానికి తీసుకొచ్చింది రూపాయ లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సెల్బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.
Also Read: Zoo Park Price Hike: పర్యాటకులకు షాక్.. భారీగా పెరగనున్న జూపార్క్ ధరలు
'మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టావు. సొరంగంలో సహాయక చర్యలు ఒక్కడుగు ముందుకు .. వందడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'అక్కడ ఆక్సిజన్ లేదు. కన్వేయర్ బెల్టు తెగిపోయింది. 96 గంటలు దాటినా ఒక్కడుగూ ముందుకు పడడం లేదు' అని కేటీఆర్ వివరించారు. 'కాళేశ్వరం పర్రెల మీద.. శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారుకూతలు కూసి, విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్సెల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదు' అని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. హస్తిన యాత్రలు మాని ఆ కార్మికుల గోడు వినండి అని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండని కోరారు. అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదు .. ఈ జాతి సంపద అని గుర్తుచేశారు.
Also Read: Neera Cafe: హైదరాబాద్ ప్రజలకు భారీ షాక్.. నీరా దుకాణం బంద్?
కాగా శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనుల్లో ప్రమాదం సంభవంచి మూడు రోజులు గడిచినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సహాయ చర్యలు నామమాత్రంగా జరుగుతుండగా.. మంత్రులు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు.. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. కానీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం లేదు. 8 మంది ప్రాణాలు గాల్లో దీపాలుగా ఉన్నా వారిని కాపాడేందుకు చేయాల్సిన స్థాయిలో స్పందించడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి, మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ప్రమాదంపై నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ రేపు ప్రమాద స్థలాన్ని సందర్శించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









