)
RRR Farmers Protest: రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్తో నష్టపోతున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. అలుపెరగని పోరాటం చేస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో రైతులు బీఆర్ఎస్ పార్టీని సంప్రదించారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు పూర్తి మద్దతు ప్రకటించిన కేటీఆర్ అనంతరం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్, ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఆర్ఆర్ఆర్తో ఎవరికీ ఇబ్బంది ఉండదని హామీ చెప్పి ఆ హామీల మీదనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తీవ్ర నష్టం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక కాంగ్రెస్ నేతలు గెలిచిన తర్వాత రైతులను పూర్తిగా మర్చిపోయారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో వ్యవసాయం, ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
గతంలో భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు తమ ప్రభుత్వం నేరుగా రైతులతో చర్చలు జరిపి, వారికి పునరావాసం కల్పించి, శాశ్వత పరిష్కారాలు చూపించిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓఆర్ఆర్ విషయంలో.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో అలైన్మెంట్లు మార్చి పేదల, రైతుల జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ బాధితుల అంశాన్ని పార్లమెంట్, రాజ్యసభలలో బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
అసెంబ్లీలోనూ ఆర్ఆర్ఆర్ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయబద్ధమైన అలైన్మెంట్ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ బాధితులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఐకమత్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని కేటీఆర్ సూచించారు. ఇలా చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగివస్తాయని సమస్య వారి దృష్టికి వెళ్తుందని పేర్కొన్నారు.
ఇకపై జనతా గ్యారేజ్
బీఆర్ఎస్ పార్టీ కార్ఆయలయం తెలంగాణ భవన్ అనేది ఇప్పుడు జనతా గ్యారేజ్ అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రైతులు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి న్యాయ నిపుణులను సంప్రదించవచ్చని.. సహకారం తీసుకుని సలహాలు పొందవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో నల్గొండ జిల్లాకు అద్భుతమైన అభివృద్ధి కల్పించామని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాలను నమ్మి ఓటేసిన ప్రజలకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook