SLBC Tunnel Collapse: శ్రీశైలం ఎడమ కాలువ సొరంగంలో ప్రమాదం సంభవించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం.. అలసత్వం ప్రదర్శించడంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యూడిషల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
Also Read: Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై 'ఎక్స్' వేదికగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యూడిషల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదానికి బాధ్యులైన వారి పై విచారణ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.
Also Read: Holiday: గుడ్‌న్యూస్.. ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు
'ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఇంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. 'గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్‌ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమిషన్‌లు ఏర్పాటు చేశారు' అని కేటీఆర్ వివరించారు.
వరుసగా జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలపై న్యాయ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని కేటీఆర్ 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు.
Irrigation Minister Uttam Kumar Reddy garu is shamelessly singing peons of their work
And another gem of a minister Komatireddy Venkat Reddy manages to stay clueless throughout
All they have to show after four days of work at SLBC is eight missing people, bunch of debris, slush…
— KTR (@KTRBRS) February 25, 2025
#WATCH | Hyderabad, Telangana | On the SLBC tunnel mishap, BRS Working President and MLA KT Rama Rao says, "We demand the Congress government in Telangana to come forward immediately in light of recent spate of incidents that have happened, spate of mishaps that have happened… pic.twitter.com/DrLoIVtXfW
— ANI (@ANI) February 25, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









