KTR Padayatra in Telangana: పాదయాత్ర.. తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. గతంలో పాదయాత్ర చేసినా నేతలంతా సక్సెస్ అయ్యారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు లీడర్లకు పాదయాత్ర ఎంతగా ఉపయోగపడిందో.. వారికి ఊహించని పదవులను తీసుకొచ్చింది. కొందరైతే ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. వీరిలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చెవేళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెట్టి.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగింది.
ఇక 2014 ఎన్నికలకు ముందు విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు కూడా పాదయాత్రనే నమ్ముకుని అధికారంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర చేసినా చంద్రబాబు దాదాపు 3 వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 65 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు పాదయాత్ర విరామం లేకుండా సాగింది. ఆయన తర్వాత.. అదే సెంటిమెంట్‌ను ఫాలో అయినా వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్ పాదయాత్ర చేసి మంత్రి అయ్యారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేసేందుకు కేటీఆర్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇక తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దాంతో గులాబీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటన ప్రారంభించిన కేటీఆర్.. రానున్న డిసెంబర్ వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారట. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నారు. అయితే కేటీఆర్ ఉన్నపళంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించడం వెనుక పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో పాదయాత్ర చేపట్టిన నేతలంతా ముఖ్యమంత్రులు అయ్యారు. అందుకే తనకు రూట్ క్లియర్ చేసుకునేందుకే పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధినేతగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆరే నెంబర్ టు లీడర్ అని బీఆర్ఎస్ నేతలంతా చెబుతుంటారు. కానీ ఇటీవల కవిత కూడా సీఎం రేసులో తాను ఉన్నానని ప్రకటించారు. సీఎంకు ఉండాల్సిన అర్హతలన్నీ తనకు ఉన్నాయని ప్రకటించుకున్నారు. అటు హరీశ్ రావు కూడా బీఆర్‌ఎస్ లో కీలక నేత కావడం.. కేటీఆర్‌కు ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకేదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా తన పాదయాత్రతో నేతలంతా గప్‌చుప్ అవుతారని ఆయన భావిస్తున్నారట. ఇదే సమయంలో పార్టీకి కూడా ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తంగా పాదయాత్ర తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియాలంటే మాత్రం.. మరో మూడున్నరేళ్లు ఆగాల్సిందే..!
Also Read: Investment Plan: సామాన్యులకు అదిరిపోయే వార్త..250రూపాయలతో సిప్..ధనవంతులవ్వడం పక్కా
Also Read: Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మరో లొల్లి.. భార్యతో విష్ణు విడాకులు..!.. కామెంట్స్ వైరల్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









