)
Cotton Farmers: రైతుల ప్రధాన పంట పత్తిపై రేవంత్ రెడ్డి నిండా నిర్లక్ష్యం చేస్తున్నాడని.. పత్తి కొనుగోలు చేపట్టకపోవడంతోపాటు మద్దతు ధర లేకపోవడం వంటి వాటిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులకు అండగా ఉంటామని.. వారి సమస్యలు పరిష్కరించేదాకా అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పండే పత్తి పంట సమస్యలు, తేమ శాతం బాధలు, పంట నష్టాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులను కలిసి వారి సమస్యలు విన్న అనంతరం కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ బృందం మంగళవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులను కలిసింది. పత్తి రైతుల సమస్యలపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాపస్ (కాపస్) యాప్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎకరానికి ఏడు క్వింటార్ల పత్తిని మాత్రమే కొంటామంటూ పెట్టిన నిబంధనను వెంటనే తొలగించాలని, తేమ శాతం 20 వరకు ఉన్న పట్టి కొనుగోలు చేయాలని సీసీఐకి విజ్ఞప్తి చేశారు. కిసాన్ కపుల్స్ ఆప్‌ను తీసుకువచ్చిన సీసీఐ సరైన శిక్షణ, అవగాహన లేకుండా ఆకస్మికంగా ప్రవేశపెట్టడంతో కొనుగోళ్లలో అనవసరమైన జాప్యం జరుగుతోందని కేటీఆర్ వివరించారు.
ఆదిలాబాద్‌లో రైతులందరికీ స్మార్ట్ఫోన్లు ఉండాలనే నిబంధన లేదని.. కనెక్టివిటీ సరిగా లేదని, శిక్షణ లేని కారణంగా ఈ యాప్‌తో రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి 5 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసే సీసీఐ ఈసారి లక్ష క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదని రైతులు చెబుతున్నారని, పాత పద్ధతిలోనే మార్కెట్ యార్డుకు వచ్చి నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించాలని సీసీఐని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
'ఈ ఏడాది ఆదిలాబాద్‌లో భారీ వర్షపాతం.. నవంబర్ 18వ తేదీ నాటికి 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో నల్లరేగడి నేలల్లో పండించే పత్తిలో తేమ శాతం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 20-22 శాతం తేమ ఉన్నప్పటికీ సీసీఐతో కొనుగోలు చేయించాం' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సీసీఐ అధికారులు నిబంధన పెట్టడం వల్ల క్వింటాలుకు 8,110 రావాల్సిన రైతుకు కేవలం రూ.5 వేల నుంచి రూ.6,200 మాత్రమే వస్తుండడంతో.. సుమారు 3 వేల వరకు నష్టపోతున్నారని కేటీఆర్ వివరించారు. కొనుగోలు పరిమితి నిబంధనను మాజీ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ప్రస్తుతం కేవలం 7 క్వింటాళ్లే కొంటామని నిబంధన పెట్టడం సరికాదని.. దీనిని కచ్చితంగా 13 క్వింటాళ్ల వరకు పెంచాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి