)
Wanaparthy Viral News: అతను చనిపోయాడని అందరూ అనుకున్నారు. పడకొబెట్టి.. పూలమాలలు వేశారు. దహన సంస్కారాలు కోసం డబ్బులు ఇచ్చి.. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. తన అభిమానిని చివరి చూపు చూసేందుకు వచ్చిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమయస్పూర్తితో అతని ప్రాణాలు నిలిచాయి. తన అభిమాన నాయకుడు పిలుపుతో ఒక్కసారిగా శరీరంలో కదలికలు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. కోలుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగింది.
పూర్తి వివరాలు ఇలా.. వనపర్తికి చెందిన తైలం రమేష్.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వీరాభిమాని. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి పనిచేశారు. నిరంజన్ రెడ్డిపై అభిమానంతో ఏకంగా ఛాతీపై ఆయన ఫొటో, పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు రమేష్. మూడు రోజుల క్రితం వనపర్తిలోని పీర్ల గుట్టలో తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురై.. కాసేపటికే స్పృహ కోల్పోయాడు. శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో.. రమేష్ చనిపోయాడని అందరూ భావించారు. బంధువులు అందరికి మరణించిన విషయం చెప్పారు.
ఆదివారం సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రమేష్ మరణవార్త తెలుసుకున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. చివరి చూపు చూసేందుకు వచ్చారు. పూలమాల వేసేందుకు కిందకు వంగిన సమయంలో రమేష్ శరీరంపై ఉన్న తన పచ్చబొట్టును తీక్షణగా చూశారు. ఆ సమయంలో ఊపిరి పీల్చుకుంటున్నట్లు అనిపించింది. వెంటనే రమేష్‌పై పూలమాలలు తీయించి.. రమేష్.. రమేష్ అంటూ కాస్త గట్టిగా పిలవడంతో మరింతగా కదిలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా కోలుకున్నాడు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి సమయస్ఫూర్తికి రమేష్‌తోపాటు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చర్చగా మారగా.. తెలంగాణ వ్యాప్తంగా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.