Retired Employees: 'రిటైర్ ఉద్యోగులకు రూ.4 వేల కోట్లు బాకీ.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పుడు..?'

Telangana Retired Employees: కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తీసుకువస్తామని చెప్పి మోసం చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సీపీఎస్ కింద కట్ చేసిన అమౌంట్ కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 26, 2025, 01:29 PM IST
Retired Employees: 'రిటైర్ ఉద్యోగులకు రూ.4 వేల కోట్లు బాకీ.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పుడు..?'

Telangana Retired Employees: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని వివిధ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఏదో ఒక జబ్బుతో భాధ పడుతుంటారని.. డబ్బులు రాక రిటైర్ ఉద్యోగుల్లో రోజుకు ఒక్కరు చనిపోతున్నారని అన్నారు. గుండె ఆగి ఏ రిటైర్ ఉద్యోగి చనిపోయినా అది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఇటీవలనే సోమిరెడ్డి అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు డీఈఓ కార్యాలయం దగ్గరే గుండెపోటుతో చనిపోయారని గుర్తు చేశారు. పదివేల మంది రిటైర్ ఉద్యోగులకు 4 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉందని.. ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపైనా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

Add Zee News as a Preferred Source

"పాత పెన్షన్ విధానం తెస్తామని చెప్పి మోసం చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం ఉద్యోగుల కింద నెలకు కట్ చేసిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం జమ చేయడం లేదు. ఉద్యోగుల జీతం నుంచి నెలకు జమ చేయాల్సిన డబ్బులను ప్రభుత్వం వాడుకుంటోంది. రెండున్నర లక్షల సీపీఎస్ ఉద్యోగుల నుంచి నెలకు వంద కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి దాకా 1300 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఉద్యోగుల అకౌంట్లలో వేయకుండా సొంత అవసరాలకు వాడుకుంది. ఇక ఉద్యోగుల సమస్యలపై ఊరుకునే ప్రసక్తే లేదు. పీఎఫ్ సొమ్ములు వాడుకోవడం చట్ట విరుద్ధం. ప్రైవేటు కంపెనీలు పీఎఫ్ మొత్తాన్ని జమ చేయక పోతే కేసులు పెడతారు. అలాగే ఉద్యోగుల సొమ్మును ప్లాన్ అకౌంట్లో జమ చేయని శాఖాధిపతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి" అని వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు.

 బీఆర్ఎస్ నేత జి.దేవీప్రసాద్ మాట్లాడుతూ.. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం కింద ఉద్యోగుల నుంచి కట్ చేస్తున్న మొత్తం ప్లాన్ అకౌంట్లలో జమ కావడం లేదని తెలిపారు. ప్లాన్ అకౌంట్లలో ఏ ఉద్యోగికి ఎంత జమ చేశారో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని అన్నారు. 24 వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ము విషయంలో అకౌంట్లు గందరగోళంగా ఉన్నాయన్నారు. అసలే కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిందని.. సీపీఎస్ రద్దు చేస్తామని ఓ వైపు హామీ ఇచ్చి ఆ విధానం కింద నియమితులైన వారిని ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని.. కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

"2026 కు ముందు రిటైర్ ఆయిన ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనెఫిట్ల విషయంలో కేంద్రం తెచ్చిన చట్టాలు హానికరంగా ఉన్నాయి.. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయం లో ఇచ్చిన హామీలు సరిగా అమలు కావడం లేదని మాకు పిర్యాదులు వస్తున్నాయి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. సీపీఎస్ ఉద్యోగులు, రిటైట్‌మెంట్ ఉద్యోగుల ఆందోళనలకు మా మద్దతు ఉంటుంది." అని ఆయన అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ పాలన విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ లో 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలపై కొత్త విధానం తీసుకువస్తున్నారని.. సరైన మార్గదర్శకాలు లేకుండా కొత్త తనిఖీల విధానం సరికాదన్నారు. స్కూల్ అసిస్టెంట్లను తనిఖీల్లో భాగస్వామ్యం చేస్తే విద్యార్థులకు భోధనపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వెంటనే తనిఖీల్లో లోపాలను కింది స్థాయి నుంచి గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. కొత్త విధానంపై ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

Also Read: TS Local Body Elections: మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,హైకోర్టు కీలక తీర్పు

Also Read: ఎట్టకేలకు రోదసిలోకి శుభాంశు శుక్లా.. 41 యేళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారత వ్యోమగామి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News