)
Telangana Local Body Elections: గంభీరంగా.. దిట్టంగా కనిపించే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. బహిరంగ సమావేశంలో వలవల అంటూ ఏడ్చేశారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేసినా కూడా ఆప్పుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. సంగారెడ్డిని వణికించే నాయకుడు.. ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే జగ్గారెడ్డి అలా భావోద్వేగానికి లోనవడం గమనార్హం. ఇంతకీ ఆయన ఎందుకు ఏడ్చాడో తెలుసుకుందాం.
స్థానిక ఎన్నికల సన్నాహాకంలో భాగంగా సోమవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండలం నాయకుడు ఆంజనేయులు భూమిని విక్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుచేసుకుని జగ్గారెడ్డి ఏడ్చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించారు. క్యాన్సర్ బారిన పడిన వారికి అన్ని విధాలుగా ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. నవంబర్‌లో ముఖ్య కార్యకర్తలను మండలాల వారీగా కలుస్తానని.. కార్యకర్తల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లికి సాయం చేస్తానని తెలిపారు. ఫోన్ చేస్తే అందుబాటులో లేడు అనడం కాదు.. నా పేరు చెబితేనే పనులు అయిపోతాయి అని జగ్గారెడ్డి వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ని అన్ని పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సూచించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మునిసిపాలిటీల్లో గెలిచి రావాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. 'ఎన్నికల్లో గెలుపు కోసం అప్పులు చేయండి. ఆ అప్పులు ఎలా కట్టాలో నేనే చెబుతా' అని సూచించారు. ఈ సందర్భంగా గతంలో ఓ కార్యకర్త చేసిన భూమి విక్రయాన్ని గుర్తుచేసుకుని జగ్గారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.