)
Reddy Community: తెలంగాణలో కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రాయలేని విధంగా రెడ్లపై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా ఆయన బాటలో అంజన్ కుమార్ యాదవ్ నిలిచారు. అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టడంతో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రెడ్డి సామాజికవర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ఫై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి.
'రాహుల్ గాంధీ చెప్పడంతోనే కులగణన జరిగింది.. లేకుంటే ఈ కొడుకులు ఎప్పుడు కానిస్తుండే?' అని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. 'తెలంగాణనే అడ్డుకున్నారు ఈ కొడుకులు (రెడ్లు). రాజ్యసభ యాదవులదే అందుకే అనిల్ కుమార్‌కి ఇచ్చారు. ఓడిపోయే సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు' అని పలు సందర్భాలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇంట్ల కూర్చున్న వాణ్ణి తెచ్చి (దానం నాగేందర్) టికెట్ ఇచ్చి పార్టీ ఎంపీ సీట్ కోల్పోయింది' అని సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఓటమిని అంజన్ కుమార్ గుర్తుచేశారు.
'నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్లు (రెడ్లు) ఇవ్వలేదు. సోనియా గాంధీకి చెప్పి నన్ను లాలూ ప్రసాద్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. ఆ పదవి ఇవ్వకూడదని ఉత్తమ్, జగ్గారెడ్డి నాకు అడ్డు తగిలారు. నన్ను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకుంది వీళ్లే. ఈ కొడుకులు వీళ్ల వల్లనే (రెడ్లు) నష్టమైంది. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా పోటీ చేస్తారు ఈ నా కొడుకులు (రెడ్లు). మనకేమో (బీసీ) టిక్కెట్ ఇవ్వరు' అని కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులతోపాటు రెడ్డి సామాజికవర్గంపై అంజన్ కుమార్ యాదవ్ వివరించారు.
'ఓడిపోయిన జీవన్ రెడ్డికి మళ్లీ ఎంపీగా ఎందుకు టికెట్ ఇచ్చారు? వాణ్ణి దానం నాగేందర్‌ని పక్కపార్టీ వాణ్ని తీసుకొచ్చి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. గెలిచే సమయంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. మొన్న సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తే నేను గెలిచేవాన్ని. వాడికి టికెట్ ఇచ్చినందుకే పార్టీ ఓడిపోయింది' అని దానం నాగేందర్‌తోపాటు రెడ్డి నాయకులపై అంజన్ కుమార్ విరుచుకుపడ్డారు. గెలిచే సమయంలో టికెట్ ఇచ్చినా దానం ఓడిపోయాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు కాంగ్రెస్‌లోకి భజన సంఘాలు వచ్చాయి' అని తెలిపారు. 'మాకు (యాదవులకు )అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఇప్పటినుండి ఊరుకునేది లేదు' అంటూ అంజన్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.