)
Sammakka Sarakka Barrage: సమ్మక్క సారక్క బ్యారేజ్‌కు ఉత్తమ్ అనుమతులు సాధించినట్టు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. 'చత్తీస్‌ఘడ్‌తో 50 ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. సమ్మక్క బ్యారేజ్‌కు కొత్తగా అనుమతులు సాధించినట్టు డబ్బా కొట్టుకుంటున్నారు' అని ఉత్తమ్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్నీ చేసిందని గుర్తుచేశారు.
'2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.811 కోట్ల వ్యయంతో దేవాదులకు జీవో ఇవ్వగా 2009లో పూర్తి కాలేదు. రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా దేవాదుల ప్రాజెక్టు నుంచి సరిగా నీళ్లు తోడలేకపోయారు. ఇన్‌టేక్ వెల్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదు. 170 రోజులు నీళ్లు తోడాల్సి ఉండగా 110 రోజులు కూడా దేవాదులతో నీళ్లు రాలేదు' అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ వివరించారు.
'దేవాదుల ప్రాజెక్టులో 37 టీఎంసీల నీళ్లు కూడా కాంగ్రెస్ హయాంలో తోడలేదు. ఫుట్ వాల్ కూడా సరిగా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారు. దేవాదులను పటిష్టం చేసేందుకు 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్‌ను కేసీఆర్ నిర్మించారు. సమ్మక్క బ్యారేజ్‌కు ఛత్తీస్‌ఘడ్ అభ్యంతరాలతో సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదు' అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.
'2023 ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్‌కు అనుమతులు దక్కకుండా చేశారు. అప్పుడు ఛత్తీస్‌ఘడ్ సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని ఉత్తమ్ తీసుకొచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ తెలిపారు. దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి నిల్వ చేసుకునేందుకు పది రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దే అని ప్రకటించారు.
'పెండింగ్ రిజర్వాయర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలి. 50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కస్టపడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలి' అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. 'తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్‌పై మహారాష్ట్రతో చర్చలు జరుపుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. 152 మీటర్లకు తక్కువగా బ్యారేజ్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని డిమాండ్ చేస్తున్నాం' అని మాజీ ఎంపీ వినోద్ తెలిపారు.
దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మాజీ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. 'వర్షాకాలం అక్టోబర్‌లో ముగుస్తుంది.. మేడిగడ్డకు మరమ్మతులు మొదలు పెట్టి అందుబాటులోకి తేవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 'ఈ సీజన్లో లక్షలాది క్యూసెక్కుల నీళ్లు పారినా మేడిగడ్డ పిల్లర్లు ఒక్క మిల్లిమీటర్ కూడా చెక్కు చెదరలేదు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మీద దుష్ప్రచారం చేయడం మానేసి ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి' అని రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook