Wife Boyfriend: మద్యంలో విషం కలిపినా చావని భర్త.. చివరకు భార్య ఏం చేసిందంటే

Extramarital Affair Ends Husband Life: ప్రేమించి వివాహం చేసుకుని ఆనందంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య ఓ వ్యక్తి దూరాడు. అతడి వలన కట్టుకున్న భార్యనే భర్తను కిరాతకంగా చంపేసింది. విషం పెట్టినా చనిపోలేదని ఓ జలాశయానికి తీసుకెళ్లి అక్కడ చంపేసిన ఉదంతం ఒళ్లు గగుర్పొడుస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 29, 2024, 05:10 PM IST
Wife Boyfriend: మద్యంలో విషం కలిపినా చావని భర్త.. చివరకు భార్య ఏం చేసిందంటే

Love Marriage: ఇతర వ్యక్తితో పరిచయం పడక గది వరకు తీసుకెళ్లింది. అతడి మైకంలో భర్త, కుటుంబం కనిపించలేదు. చివరికి అతడి మాయలో పడి భర్తను అత్యంత క్రూరంగా భార్య హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. మద్యంలో విషం కలిపి ఇచ్చినా భర్త చావకపోవడంతో మరింత ఆగ్రహంతో భర్తను తీసుకెళ్లి ఓ జలాశయంలో ఊపిరాడకుండా చేసి భార్య హతమార్చింది. ఈ దారుణ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది చదవండి: Red Sandalwood: 'పుష్ప'ను మించి ఎర్రచందనం స్మగ్లింగ్‌.. శేషాచలంలో 12 మంది కూలీలు అరెస్ట్‌

 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేసే జగదీశ్‌ తాను ప్రేమిస్తున్న కీర్తిని 2011లో వివాహం చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంలోకి బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి దూరాడు. అతడితో ఏర్పడిన పరిచయం పడక గది వరకు చేరుకుంది. నిత్యం వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకుంటున్నారు. ఫోన్లు.. తరచూ కలసుకోవడాలు జరుగుతుండడంతో భార్య కీర్తిలో మార్పును భర్త జగదీశ్ గమనించాడు. నాగరాజుతో నడిపిస్తున్న వ్యవహారం బయటపడింది.

ఇది చదవండి: Medico Suicide: నా చావుకు నేనే కారణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న మెడికో ఆత్మహత్య

 

విషయం బయటకు తెలియడంతో జగదీశ్, కీర్తిల మధ్య గొడవలు మొదలయ్యాయి. కొన్నాళ్లకు ప్రియుడు నాగరాజు భార్యకు కూడా ఈ విషయం తెలియడంతో చిచ్చు రేపింది. ఇరు కుటుంబాల్లో తీవ్ర అలజడి రేపింది. గొడవల కారణంగా కీర్తి, నాగరాజు ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఈ గొడవలకు ముగింపు పలకాలటే జగదీశ్‌ను చంపితేనే పరిష్కారం అని కీర్తి, నాగరాజు భావించారు. తన భర్త హత్యకు భార్య కీర్తి ప్రణాళిక రచించింది.

తమ అక్రమ సంబంధానికి అడ్డు ఉన్న భర్తను చంపేందుకు భార్య కీర్తి ఈనెల 25వ తేదీన పథకం పన్నింది. మత్తు మందు కలిపిన మద్యాన్ని జగదీశ్‌తో తాగించింది. మత్తులో ఉన్న జగదీశ్‌ చనిపోలేదు. దీంతో ప్రియుడు నాగరాజుతో కలిసి కీర్తి తన భర్త జగదీశ్‌ను తీసుకెళ్లి కేఎల్‌ఐ కాలువలో తీసుకెళ్లారు. అక్కడ జగదీశ్‌ను ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఎవరికీ అనుమానం కలగకుండా కీర్తి తన భర్త జగదీశ్ కనిపించడం లేదంటూ నాటకం ఆడింది. ఈ హత్యకు కీర్తి తల్లి కూడా సహకరించడం గమనార్హం.

కొన్ని రోజులకు కేఎల్‌ఐ కాలువలో ఒక మృతదేహం లభించడంతో పోలీసులు ఆ మృతదేహాన్ని కీర్తికి చూపించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు భార్య కీర్తి నుంచి నిజాలు కక్కించారు. కీర్తితోపాటు ఆమె ప్రియుడు నాగరాజు, ఆమె తల్లి పద్మ కూడా సహకరించడంతో వారిని అరెస్ట్‌ చేశారు. సహకరించిన శివ, సుధాకర్, మోహన్ గౌడ్, సాయికుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News