)
Harish Rao -KTR: నోరు ఉంది కదాని పారేసుకోవడం కాదు.. జాతీయ నేర గణాంక విభాగం రిపోర్టు వెల్లడించిన నిజాలు తెలుసుకుంటే.. మూసుకుంటారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే అన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టులాటిందన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో మాట్లాడే ముందు ఈ గణాంకాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14వ స్థానానికి ఎలా పరిమితం అయ్యిందో చెప్పాలన్నారు. 10ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతును రాజును చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి.. ఆయన చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితం ఇదే అన్నారు. కేసీఆర్ కు రైతుకు ఉన్నది పేగు బంధమని.. ఆత్మ బంధమని అన్నారు. కానీ కాంగ్రెస్ కు ఉన్నది కేవలం ఓటు బంధమే అంటూ విమర్శలు చేశారు.
2014లో రాష్ట్రంలో 1,347 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, 2023 నాటికి ఈ సంఖ్య కేవలం 56కి తగ్గి, 95.84 శాతం రికార్డు స్థాయిలో తగ్గుదల నమోదైందని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులను రాజులు లా చూడాలన్న దృఢ సంకల్పానికి, నిర్విరామ కృషికి ఇది ప్రతిఫలమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతుల సంక్షేమానికి అమలు చేసిన పథకాల ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, పంటల సరఫరా, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వంటి పథకాలు రైతులకు భరోసా, ఆర్థిక స్థిరత్వం అందించాయని హరీశ్ రావు వివరించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల సంఘటనలు సాధారణం కావడం గమనార్హం. అయితే స్వరాష్ట్ర ఏర్పాటుతో, కేసీఆర్ పథకాల వల్ల తెలంగాణ సస్యశ్యామల భూభూమి, సాగు ప్రగతితో, ధాన్యపురాశులతో సుఫలంగా మారిందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
ఇక 2014 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 1,347 నుండి 56కి తగ్గడం, దేశంలో మొత్తం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 10.9 శాతం నుంచి 0.51 శాతానికి పడిపోవడం, కేసీఆర్ పాలనలో రైతుల సంక్షేమానికి వచ్చిన గణనీయమైన ఫలితాన్ని సూచిస్తుంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాకతోనే పరిస్థితులు మారిపోయాయని, గత రెండు సంవత్సరాలలో 700 మందికి పైగా రైతులు మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడారని ఆయన పేర్కొన్నారు. హరీశ్ రావు ఆ ప్రకటన ద్వారా కేసీఆర్ పాలనలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగానికి ఇచ్చిన ఊపిరి స్పష్టమని, ఇప్పుడు ఆ ఫలితాలను కొనసాగించేందుకు ప్రభుత్వ నిష్పక్షపాత చర్యలు అవసరమని గుర్తుచేశారు.
అటు ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. తెలంగాణ 2014 నుంచి 10ఏండ్ల కాలంలో రైతుల బలవన్మరణాలు తగ్గాయన్న ఎన్సీఆర్బీ నివేదకపై ఆయన మాట్లాడారు. తన అధికారిక సోషల్ మీడియాల అకౌంట్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేసీఆర్ రైతు బంధు పాలన రైతులకు స్వర్ణయుగమే అని మరోసారి రుజువైందన్నారు. అప్పటి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్ల 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook