)
Kodangal Farmers: అధికారంలోకి వచ్చని రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలో నిత్యం రైతులతోపాటు ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. వివిధ సమస్యలపై ప్రజలు, రైతులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నారు. గతంలో లగచర్ల పోరాటం ఉధృత స్థాయిలో జరగగా.. తాజాగా నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ చేపడుతుండగా రైతులు అడ్డుకుంటున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఈ ఉద్యమానికి కానుకుర్తి అనే గ్రామం కేంద్రంగా మారింది. అధికారులు పోలీసుల పహరాలో కానుకుర్తి చెరువును శుక్రవారం సర్వే చేసేందుకు సిద్ధమవగా రైతులు అడ్డుకున్నారు. అంతకుముందుగానే పలువురు రైతు సంఘం నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. రైతు సంఘాల నాయకులను అడ్డుకున్నా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమకు న్యాయమైన పరిహారం ఇచ్చేవరకు ఒప్పుకునేది లేదని.. స్పష్టమైన హామీ ఇస్తేనే భూసేకరణకు సహకరిస్తామని రైతులు తేల్చి చెప్పారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఇప్పటికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు చేపట్టడం రేవంత్ రెడ్డికి సవాల్‌గా మారింది.
పెట్రోల్ డబ్బాలు, పురుగుల మందులతో రైతులు భారీ నిరసన చేపట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందారు. నిరసన చేస్తున్న రైతుల దగ్గరకి నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ చేరుకొని 'సర్వే జరిగితే ఏం కాదు.. సర్వే జరిగిన తర్వాత 90 రోజుల నుంచి వంద రోజుల సమయం ఉంటుంది కాబట్టి సర్వే చేస్తే ఎలాంటి నష్టం జరగదు' అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
'ఇక్కడి రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారికి పరిహారం ఇవ్వటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు తగినంత పరిహారం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి దగ్గర ఫైల్ ఉన్నది ఏ క్షణాన్నైనా అక్కడి నుంచి ప్రకటన వస్తే దానికి అనుగుణంగానే మేము మీకు పరిహారం చెల్లిస్తాం' అని అదనపు కలెక్టర్ వివరించారు. అయితే తమకు ఎన్ని డబ్బులు ఇచ్చిన తక్కువేనని రైతులు స్పష్టం చేశారు. స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఎలాంటి సర్వే చేసేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చోవడంతో అధికారులు వెనుతిరిగి పోయారు. ఇలా సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు తిరుగుబాటు చేస్తుండడంతో రేవంత్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం.. అసహనం వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.