Peddapalli Murder: మరో పరువు హత్య.. కూతుర్ని ప్రేమించాడని వేటకొడవళ్లతో నరికి చంపిన తండ్రి..

Peddapalli Sai Kumar Murder: యువకుడు తన స్నేహితులతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో యువతి తండ్రి అక్కడకు వెళ్లి గొడ్డలితో అందరి ముందే అత్యంత క్రూరంగా నరికి చంపాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 28, 2025, 12:02 PM IST
  • తెలంగాణలో పరువు హత్య కలకలం..
  • యువకుడ్ని నరికి చంపిన తండ్రి..
Peddapalli Murder: మరో పరువు హత్య.. కూతుర్ని ప్రేమించాడని వేటకొడవళ్లతో నరికి చంపిన తండ్రి..

Peddapalli honor Murder Case: తెలంగాణలో మరో పరువు హత్య ఘటన కలకలంగా మారింది. ఇటీవల తెలంగాణలో మిర్యాల గూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తుది తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది జరిగి కనీసం నెల రోజులు గడవక ముందే.. మరో పరువు హత్య తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. తన కూతుర్ని ప్రేమించిన పాపానికి యువకుడ్ని.. ఆమె తండ్రి వెంటపడి అత్యంత క్రూరంగా హతమార్చాడు. ఈఘటన ప్రస్తుతం పెద్దపల్లిలో చోటు చేసుకుంది.
 

Add Zee News as a Preferred Source

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీరి కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. అయిన కూడా ఇద్దరు తరచుగా కలుసుకునే వారు. వీరి వ్యవహరంపై యువతి తండ్రి పలు మార్లు హెచ్చరించాడు. కానీ వీళ్లు మాత్రం సీక్రెట్ గా ఫోన్ లలో మాట్లాడుకుంటూ.. కలుసుకునేవారు.ఈ క్రమంలో.. కోపంతో రగిలిపోయిన యువతి తండ్రి.. ఇక యువకుడ్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడు.

అనుకున్న ప్రకారం.. యువకుడి కోసం కత్తి పట్టుకుని గాలించాడు. అతను..గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో ఉన్నాడు. ఇది గమనించిన యువతి తండ్రి..వెంటనే వెనక్క నుంచి గొడ్డలితో ఇష్టమున్నట్లు నరికిచంపాడు.ఈ ఘటనతో అక్కడున్న వారంత భయంతో పరుగులు పెట్టారు. ఘటన గురించి సాయి కుమార్ కుటుంబానికి తెలిపారు.

Read more: KTR Vs Revanth Video: నాకు రంకులు అంటకట్టింది మీరు.. అసెంబ్లీలో రెచ్చిపోయిన కేటీఆర్.. వీడియో వైరల్..

అక్కడకు వాళ్లు చేరుకునే వరకు సాయికుమార్..రక్తపు మడుగులో ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే  చనిపోయాడాని వైద్యులు ప్రకటించారు. సాయి కుమార్ పుట్టిన రోజునాడే.. ఈ ఘటన జరగడటంతో.. యువకుడి కుటుంబీకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News