BMW Car Kills Youth: కటిక పేదరికంలో ఉన్న విషయాన్ని కొడుకు కొన్ని లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కొనివ్వాలని పట్టుబట్టాడు. తన స్థోమత అంత లేదని.. చిన్నపాటి స్విఫ్ట్ కారు కొనిస్తానని చెప్పగా ఆ కొడుకు వినిపించుకోకుండా తండ్రిని వేధించసాగాడు. తన తండ్రి బీఎండబ్ల్యూ కారు కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు హెచ్చరించాడు. తండ్రి ఎంతకీ కొనివ్వకపోవడంతో అన్నట్టుగానే ఆ కుర్రాడు తన ప్రాణం తీసుకున్నాడు. బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటర్మైంట్ వయస్సు పెంపు
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని చర్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య సన్నకారు రైతు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కనకయ్య కుమారుడు బొమ్మ జానీ (21)కి బీఎండబ్ల్యూ కారు అంటే చాలా ఇష్టం. ఆ కారుపై ఎంతో ఇష్టం పెంచుకుని ఆ కారు కొనాలని తండ్రిని పట్టుబడుతున్నాడు. కొద్ది రోజుల నుంచి తన తండ్రిని బీఎండబ్ల్యూ కారు కోసం ఒత్తిడి పెంచుతున్నాడు. కారు కొనుగోలు చేయకపోతే తాను చనిపోతానని తరచూ తండ్రితో గొడవపడేవాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు.. అది మనం కొనలేని పరిస్థితి అని చెప్పినా యువకుడు వినిపించుకోలేదు.
Also Read: Kavitha: 'కేసీఆర్ మీద ఈగ వాలనియ్య.. కాస్కో రేవంత్ రెడ్డి': ఎమ్మెల్సీ కవిత బస్తీమే సవాల్
పదేపదే బీఎండబ్ల్యూ కారు కోసం ఒత్తిడి చేస్తుండడంతో అప్పోసొప్పో చేసి షిఫ్ట్ కారు కొనిస్తానని జానీకి తండ్రి కనకయ్య నచ్చజెప్పాడు. తనకు నచ్చిన బీఎండబ్ల్యూ కారు కొనివ్వడం లేదని మనస్తాపం చెందిన జానీ వ్యవసాయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో జానీ మృతి చెందాడు. ఈ ఘటనతో తండ్రి కనకయ్యతోపాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఒక బీఎండబ్ల్యూ కారు కోసం యువకుడు ప్రాణం తీసుకోవడం సంచలనంగా మారింది. కుటుంబ పరిస్థితి ఆలోచించకుండా యువకుడు ఇలా బీఎండబ్ల్యూ కారును డిమాండ్ చేయడం.. అది ఇవ్వకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









